బీఆర్ఎస్ సర్కారుపై పవన్ కళ్యాణ్ పరోక్షవిమర్శలు: టీడీపీకి ధన్యవాదాలు

హైదరాబాద్: బీజేపీ-జనసేన అభ్యర్థుల తరపున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే యువత ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు కానీ.. వారి ఆశలు నెరవేరలేదన్నారు పవన్. ఉత్తరాంధ్రకు చెందిన 26 వెనుకబడిన కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారని.. బీజేపీ-జనసేన అధికారంలోకి రాగానే 26 కులాలకు న్యాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.

 Pawan Kalyan election campaign in kukatpally constituency

పేరుకే ఉత్తరాంధ్ర వాసులైనా తెలంగాణను మాతృభూమిగా చేసుకుని జీవిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్రంలోని పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన ఆవిర్భావం తెలంగాణలోనే జరిగిందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని ఆయన తెలిపారు.

జనసేనకు మద్దతు తెలిపేందుకు సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ప్రేమ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ ఓటర్లను కోరారు. తెలంగాణలో బీజేపీ-జనసేన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఇది ఇలావుండగా, ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలో నిర్వహించిన బీజేపీ-జనసేన సభ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని అదుపు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు కార్యకర్తలు పోలీసులపైకి కుర్చీలు విసిరారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+