ఉగాది: పెద్దగా మేలులేదు, 'హేమలంబ'లోనైనా.. పవన్ కళ్యాణ్ కోరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.

'ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరికీ, దేశ ప్రజలకు నా తరపున, జనసేన సైనికుల తరపున హేమలంబ నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రకృతి అనుకూలించి పాడి పంటలు స‌మృద్ధిగాఉండాలని, అభివృద్ధి పథంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉండాలని కోరుకుంటున్నా.

Pawan Kalyan greeting for Ugadi festival

గడచిన దుర్ముఖి నామ సంవత్సరం తమకు పెద్దగా మేలు చేయలేకపోయిందన్న భావనతో ఉన్న తెలుగు ప్రజల ఆశలు హేమలంబ వసంతంలోనైనా నెరవేరాలని ఆశిస్తున్నాను.

రాష్ట్ర విభిజననాటి హామీలు సంపూర్ణంగా అమలు కావాలన్న ప్రజల కోరిక ఫలించాలని ఆకాంక్షిస్తున్నాను. రైతులు, చేనేత కళాకారులు, శ్రామిక వర్గాలతోపాటు దేశంలోని ప్రతీ కుటుంబానికి శాంతి, సౌభాగ్యాలను హేమలంబ ప్రసాదించాలని జనసేన పార్టీ కోరుకుంటోంది' అని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan on Tuesday greeted Telugu people for Ugadi festival.
Please Wait while comments are loading...