వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లు అర్జున్ ట్విస్ట్: 'రెడ్డి గర్జన'కు పవన్‌ను పిలుస్తామని కొత్త 'వైయస్సార్సీపీ'!, జగన్ కోసం..

ఈ నెల (ఏప్రిల్) 30వ తేదీన హైదరాబాదులోని నిజాం కాలేజీ మైదానంలో నేషనల్ రెడ్డి మహా గర్జన నిర్వహిస్తున్నామని, ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానిస్తామని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి/చెన్నై: ఈ నెల (ఏప్రిల్) 30వ తేదీన హైదరాబాదులోని నిజాం కాలేజీ మైదానంలో నేషనల్ రెడ్డి మహా గర్జన నిర్వహిస్తున్నామని, ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానిస్తామని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

దీనికి సైకమ్ రామకృష్ణా రెడ్డి అనే ఆయన కారణం. ఆయన వైయస్సార్సీపీని స్థాపించారు. అంటే ఇది ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదు. యూత్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫర్ కామన్ పీపుల్ (వైయస్సార్సీపీ). ఈ సంస్థ తమిళనాడు, పుదుచ్చేరిల ఉన్నట్లు సైకమ్ రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

రెడ్డి సభకు పవన్ కళ్యాణ్

రెడ్డి సభకు పవన్ కళ్యాణ్

విషయానికి వస్తే, ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాదులో జాతీయ రెడ్డి మహా సభ నిర్వహిస్తున్నామని, దీనికి పవన్‌ను ఆహ్వానిస్తామని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సభ ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు.

వైయస్సార్సీపీ అంటే..

వైయస్సార్సీపీ అంటే..

అంతేకాదు, వైయస్సార్సీపీ అంటే ఏమిటో కూడా చెప్పారు. దీనికి ఏ రాజకీయ పార్టీతోను సంబంధం లేదని చెప్పారు. ముఖ్యంగా, జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీకి శాఖ కూడా కాదని పేర్కొన్నారు.

రెడ్డి సభకు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించడం వెనుక..

రెడ్డి సభకు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించడం వెనుక..

అలాగే, రెడ్డి సభకు కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించడం వెనుక కారణం కూడా చెప్పారు. మెగా కుటుంబం నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను వివాహం చేసుకున్నారని, అందుకే వారిని రెడ్డి గర్జనకు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజలు రెడ్డి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే, చంద్రబాబును, బాలకృష్ణను, నారా లోకేష్‌ను ఎందుకు ఆహ్వానించలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తారకరత్న కూడా రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

తన గురించి...

తన గురించి...

సైకం రామకృష్ణా రెడ్డి తాను ఎవరో కూడా చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్‌లో పని చేశానని చెప్పారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళంతో పని చేసినట్లు చెప్పారు. అయితే, అక్కడ సరైన నాయకులు లేరని పేర్కొన్నారు. అక్కడ ఎవరైతే తమ ఇంటి చుట్టు చక్కర్లు కొడతారో వారికి పదవులు ఇస్తారని పేర్కొన్నారు. కానీ పార్టీ కోసం సమయం, డబ్బులు కేటాయించే వారికి మాత్రం పదవులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

జగన్‌కు సూచన, అన్న కోసం పని చేస్తా

జగన్‌కు సూచన, అన్న కోసం పని చేస్తా

అక్కడ నాయకులను మార్చాలని అభిప్రాయపడ్డారు. తద్వారా వైసిపి అధినేత జగన్‌కు పరోక్ష సూచన చేశారు. అయితే, జగన్ అన్నకు తన మద్దతు ఉంటుందని మాత్రం చెప్పారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు తనవంతు ప్రయత్నం, పని చేస్తానని చెప్పారు. తన గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి తాను పట్టించుకోనని చెప్పారు.

English summary
Pawan Kalyan to invited to National Reddy Maha Garjana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X