పూనమ్ కౌర్ ఇష్యూ: మహేష్ కత్తికి పవన్ కళ్యాణ్ లేడీ ఫ్యాన్ దిమ్మతిరిగే షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను నిత్యం విమర్శిస్తూ మీడియాలో నానుతున్న మహేష్ కత్తిపై జనసేనాని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ధీటుగా స్పందిస్తున్నారు. పవన్‌కు మద్దతుగా మాట్లాడినందుకు మహేష్ కత్తి నటి పూనమ్ కౌర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  Poonam Kaur Issue : పూనం కౌర్‌ సంచలనం : మహేష్ కత్తికి ఫ్యాన్స్ రిప్లై

  పూనమ్ కౌర్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండిస్తున్నారు. ఆమెను ప్రశ్నించే పేరుతో వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించారని, పైగా అవన్నీ అవాస్తవాలు చెబుతున్నారని అందరూ మండిపడుతున్నారు. మహేష్ కత్తి చేసిన ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవాలు అని ఆధారాలతో సహా ఫ్యాన్స్ తేల్చేశారు. ఓ యువతిపై ఇష్టారీతిన ఆరోపణలు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

  లేదంటే వెళ్లిపోండి: చుక్కలు చూపించారు, రిపోర్టర్లపై మహేష్ కత్తి తీవ్ర ఆగ్రహం

  పరాయి ఆడవాళ్లపై మాట్లాడుతావా?

  పరాయి ఆడవాళ్లపై మాట్లాడుతావా?

  ఈ నేపథ్యంలో తాజాగా పవన్‌కు, పూనమ్ కౌర్‌పై తీవ్ర విమర్శలు చేసిన మహేష్ కత్తిపై రాయలసీమకు చెందిన ఓ లేడీ ఫ్యాన్ దుమ్ము దులిపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ కత్తిపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పరాయి ఆడవాళ్లను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా దున్నపోతా అంటూ విమర్శించారు.

  పవన్ చెప్పులు తుడిచే అర్హత కూడా లేదు

  పవన్ చెప్పులు తుడిచే అర్హత కూడా లేదు

  దేవుడి లాంటి పవన్ కళ్యాణ్‌ను తిడతావా అని ఆమె మహేష్ కత్తిపై విమర్శించారు. ఆయన చెప్పులు తుడిచే అర్హత కూడా నీకు లేదన్నారు. పవన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మేం ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోవాలని ఆమె హితవు పలికారు.

  దమ్ముంటే చర్చకు సిద్ధం

  దమ్ముంటే చర్చకు సిద్ధం

  అంతేకాదు, ఆ యువతి తన నెంబర్ చెబుతూ.. మహేష్ కత్తి దమ్ముంటే రా, మహేష్ కత్తికి మద్దతిచ్చేవాళ్లు కూడా ఫోన్ చేయవచ్చు అంటూ విరుచుకుపడ్డారు. ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆమె సవాల్ చేశారు. అంతేకాదు, వీడియోలో.. ఆమె ఇతరుల కాల్స్ తీసుకుంటూ మాట్లాడింది.

  పవన్ పైన అభిమానులకు ప్రేమ

  పవన్ పైన అభిమానులకు ప్రేమ

  పవన్ కళ్యాణ్‌పై అభిమానులకు ఎంతో ప్రేమ ఉందని, ఆ ప్రేమ ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరని ఆ మహిళ అన్నారు. పవన్ కళ్యాణ్‌ను పదేపదే విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

  ఇబ్బందికర పరిస్థితి

  ఇబ్బందికర పరిస్థితి

  పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ, పవన్ అభిమానులు టార్గెట్ చేయడంతో మహేష్ కత్తి పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మహేష్ కత్తి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. డైరెక్టర్ వివేక్.. ఆయనను మీ తల్లి గురించి చెప్పమని చాలా మర్యాదగా, గౌరవంగా అడిగారు. కానీ మహేష్ కత్తి మాత్రం సమాధానం చెప్పలేదు. షో నుంచి బయటకు వచ్చేశారు. దీనిపై మహేష్ కత్తి వివరణ ఇచ్చారు.

  కించపరిచినట్లు అనిపించింది

  కించపరిచినట్లు అనిపించింది

  చాలా కించపరిచినట్లు అనిపించడం వల్లే తాను ప్రోగ్రాం నుంచి బయటకు వచ్చానని, తనను, తన తల్లిని అవమానించినట్లుగా అనిపించిందని, తన తల్లిని అవమానపరచాలనుకునే వ్యక్తికి తాను, తన తల్లికి మధ్య ఉన్న అనుబంధం ఎలా చెబుతానని, తన తల్లి జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉన్నాయని, ఆ జ్ఞాపకాలు బాధాకరమైనవని అన్నారు. అయితే, వివేక్ చాలా గౌరవంగానే మీ తల్లి గురించి చెప్పాలని ప్రశ్నించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena chief Pawan Kalyan's lady fan warning to Mahesh Kathi in a video, which is viral in social media.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X