కేసీఆర్‌ను కలిసిన పవన్ కల్యాణ్: నూతన సంవత్సర శుభాకాంక్షలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. కేసీఆర్‌తో సమావేశం కావడానికి సోమవారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్ వచ్చారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సందర్భంగా పవన్.. కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం 6.20 పవన్ ప్రగతి భవన్ చేరుకోగా, 7.30కి సీఎం కేసీఆర్ వచ్చారు. కాగా, ఈ భేటీ మర్యాదపూర్వకమేనని జనసేన పేర్కొంది.

నందమూరి బాలకృష్ణ సహా పలువురు సినీ ప్రముఖులు కేసీఆర్‌ను కలుస్తూ వస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు రాలేదు. ఆయన ప్రగతి భవన్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.

రాజ్‌భవన్లో కేసీఆర్-పవన్ కళ్యాణ్ ఏకాంత చర్చ

పవన్ కల్యాణ్ ప్రగతి భవన్‌కు వచ్చిన సమయంలో కేసీఆర్ లేరు. కేసిఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలవడానికి రాజభవన్ వెళ్లినట్లు సమాచారం.

Pawan Kalyan meets KCR at Pragathi Bhavan

ఇటీవల రాష్ట్రవతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్‌లో ఇచ్చిన విందు సందర్భంగా వారివురు చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యం చేకూరిందని అంటున్నారు.

రాజ్‌భవన్‌లో కేసీఆర్, పవన్ కల్యాణ్ దేశ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, కచ్చితంగా ఏం మాట్లాడుకున్నారనేది తెలియదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena Chief Pawan Kalyan met Telangana CM K Chandrasekhar Rao at Pragathi Bhavan in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి