కెసిఆర్‌కు మజ్లిస్ గ్రేటర్ షాక్: పవన్ కళ్యాణ్ ఝలకిచ్చినా బాబు ధీమా

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి షాకివ్వనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో మజ్లిస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ఒంటరిగానే పోటీ చేయాలని మజ్లిస్ యోచిస్తోందని తెలుస్తోంది. జైమీమ్ జై భీమా అనే నినాదంతో.. పలుచోట్ల దళితులను, ఇతర బ్యాక్ వార్డ్ క్యాస్ట్ వారిని నిలబెట్టాలని యోచిస్తున్నారు.

పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి తిరుగులేదు. పట్టులేని ప్రాంతాల్లో దళితులను, ఇతర బ్యాక్ వార్డ్ క్యాస్ట్ వారిని రంగంలోకి దింపడం ద్వారా మరిన్ని సీట్లు కైవసం చేసుకోవాలని మజ్లిస్ యోచిస్తోన్నట్లుగా తెలుస్తోంది. అది కెసిఆర్‌కు పెద్ద షాకేనని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మాత్రం పొత్త వద్దని మజ్లిస్ భావిస్తోందని తెలుస్తోంది.

Pawan Kalyan shocks TDP, now shock to KCR

ఇదిలా ఉండగా, హైదరాబాదులో టిఆర్ఎస్‌కు మొన్నటి వరకు పెద్దగా పట్టులేదు. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి వంటి నేతలు చేరడం వల్ల పార్టీ బలోపేతం అవుతోంది. దానికి తోడు మజ్లిస్‌తో జతకలిస్తే మేయర్ పీఠం తమదేనని టీఆర్ఎస్ భావిస్తూ వస్తోంది.

అయితే, ఇప్పుడు మజ్లిస్ ఒంటరిగా పోటీ చేసే ఆలోచన చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీకి షాకిచ్చారు! గ్రేటర్ ఎన్నికల పైన ఇప్పటి వరకు తన నిర్ణయం తేల్చలేదు. కానీ, సెక్షన్ 8, రాజధాని భూమిపై ప్రశ్నించి టీడీపీకి మద్దతుపై అనుమానాలు రేకెత్తించారు.

చంద్రబాబు ధీమా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికే విజయావకాశాలు ఉన్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం తనను కలిసినప్పుడు ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలు, వరంగల్ ఉప ఎన్నిక పైన వారి మధ్య చర్చ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+