వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దటీజ్ పవన్ కళ్యాణ్! 2019లో కింగ్ మేకర్, అభిమానులతోనే ప్రమాదం!!'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఓ మేగజైన్‌లో 'పవర్ హెఫ్ట్' పేరుతో ఓ కథనం వస్తోంది. దీనిని జనసేన పార్టీ తెలుగులోకి తర్జుమా చేసి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. పవన్‌కు ఉన్న భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్, లెఫ్ట్ పార్టీ మద్దతుతో ఆయన గెలుస్తారని పేర్కొంది.

చంద్రబాబుపై పోటీ చేస్తా, ఏటీఎం డబ్బులు ఆయన ఖాతాల్లోకి: విజయసాయి సంచలనంచంద్రబాబుపై పోటీ చేస్తా, ఏటీఎం డబ్బులు ఆయన ఖాతాల్లోకి: విజయసాయి సంచలనం

ఇందులో పేర్కొన్న దాని ప్రకారం.. ' హిట్టు ప్లాపులు మాత్రమే ఒక స్టార్‌కు నిర్వచనంగా నిలిచే సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ వాటికి అతీతమైన వ్యక్తి. ఓ దశాబ్దం పాటు ప్లాపులే వచ్చినా జనాధరణ మాత్రం ఏ కొంచెం పలుచబడలేదు. తెలుగు సినిమా రంగంలో పవర్ స్టార్ తన అభిమానులకు ప్రపంచంలో దైవ సమానుడిగా నిలిచారు. ఆ అభిమానుల్లో పరిశ్రమలోని నటులు కూడా అనేకమంది ఉంటారు.

 పవన్ ఎలాంటివాడో తెలుసు కాబట్టి అభిమానిస్తారు

పవన్ ఎలాంటివాడో తెలుసు కాబట్టి అభిమానిస్తారు

సినిమాలలో కంటే నిజ జీవితంలో పవన్ ఎలాంటి వాడో తెలుసు కనుకనే ఆయనను అమితంగా ప్రేమిస్తుంటామని అభిమానులు చెబుతుంటారు. ఆయన ఆలోచనలు, ప్రవృత్తి, చర్యల ఆధారంగా ఏర్పరుచుకున్న భావజాలం పవనిజంకు ఆయన అనుచరులు నిబద్దులై ఉంటారు. కానీ సినిమా వేడుకలకు కూడా ఇష్టపడని, మొహమాటపడే నటుడి నుంచి అనేక మంది దృష్టిని ఆకర్షించగల రాజకీయ వక్తగా పరివర్తన చెందడం వరకు పవన్ కృషి చాలా ఉంది. 2014 ఎన్నికల్లో ఆయన ఏపీలో టీడీపీ, బీజేపీలకు అనుకూలంగా ప్రచారం చేశారని, భారీ జనస్పందన లభించిందన్నారు.

అభిమానులతోనే ప్రమాదం

అభిమానులతోనే ప్రమాదం

1996లో అక్కడ అబ్బాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రంతో పవన్ తన సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత కాలంలో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం, సంప్రదాయానికి భిన్నమైన ప్రతిభతో ఆయన ప్రత్యేకంగా నిలిచారు. సామాజిక సందేశంతో కూడిన చిత్రాలను చేయడం ద్వారా ఆయన ప్రేక్షకుల ప్రేమాభిమానాలను కూడా పొందగలికారు. అభిమానులో ఆయనకు పెద్దబలం అయిన ఆయనకు వారితోనే ప్రమాదం కూడా ఉండగలదు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఆయన నిరసన తెలియజేస్తున్నప్పుడు ఓ న్యూస్ ఛానల్‌కు చెందిన వాహనంపై రాళ్లు రువ్వి నష్టపరిచినందుకు ఐదుగురు అభిమానులను అరెస్టు చేశారు. గతంలో కూడా ఆయనను విమర్శిస్తున్న వారిపై మాటలతోను, చేతలతోను దాడి చేయడం ద్వారా తమ హీరో పట్ల ఉన్న అభిమానాన్ని మరో రకంగా చాటుకున్నారు.

 అభిమానుల మీదే ఆధారపడి విజయం సాధిస్తారా అంటే?

అభిమానుల మీదే ఆధారపడి విజయం సాధిస్తారా అంటే?

ఏది ఏమైనా పవన్ నిశ్చలంగా ఉంటూ అలాంటి ఘటనలను దారి తప్పినవిగా చూడటానికి అలవాటుపడ్డాడు. చాలామంది అభిమానులు ఇప్పటికే రాజకీయ శక్తిగా రూపుదిద్దుకున్నారని చెప్పారు. వారు కేవలం ఫ్యాన్స్ కాదు. సామాజిక సేవతో కూడా అనుబంధం కలిగి ఉన్న వారు అని చెప్పారు. అయితే ఆయన కేవలం తన అభిమానుల మీద ఆధారపడి, తన పార్టీ నిర్మాణం సాగించి, ఎన్నికల్లో విజయం సాధించగలరా? 'ఎవరైనా సరే నాకు తొమ్మిదేళ్ల రాజకీయ అనుభవం ఉన్నదనే సంగతిని గుర్తించాలి. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక సభ్యులలో నేను ఒకడిని, 2009లో తొమ్మిది నెలల్లోనే మేం 294 సీట్లలో 280 చోట్ల పోటీ చేయగలిగాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 19 శాతం ఓట్లను మేం పొందగలిగాం. మాకు తగిన వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయనడానికి అదే నిదర్శనం' అని పవన్ అంటారు.

 అధ్యయనం ఇలా

అధ్యయనం ఇలా

విపరీతంగా పుస్తకాలు చదవడమే ఆయనను తీర్చిదిద్దిందని అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతానికి ఆయన శాసన సభా చర్చల మొదటి సంపుటాన్ని చదివే పనిలో నిమగ్నమై ఉన్నారు. నేనింకా నాలుగు సంపుటాలను పూర్తి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. కానీ ఆయన ఆలోచనలను ఉద్దీపనం చేసి, ఆయనను సమూలంగా మార్చివేసిన ఒక పుస్తకం ఏమిటంటే విక్టర్ ఇ ప్రాంకిల్ రాసిన్ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనేది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అద్ విజ్ కాన్సంట్రేషన్ క్యాంపులో రచయిత అనుభవాలను ఆ పుస్తకం తెలియజెబుతుంది. ఫిక్షన్ కంటే కూడా నిజ జీవిత సంఘటనలతో కూడినవి, వాస్తవ కథనాలు తనకు నచ్చుతాయని పవన్ అంటారు.

పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇలా

పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇలా

పవన్ కళ్యాణ్ సినిమాలలో చాలావరకు విప్లవం, బాధలు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు అనేవి కథాంశాలు. ఆయనలోని వామపక్ష భావజాలానికి అవి ప్రతీకలు కావొచ్చు. వామపక్షాలు విఫలమయ్యాయని తాను అనుకోవడం లేదని పవన్ అన్నారు. లెఫ్ట్ విధానాలు చాలా సున్నితంగా ఉండవచ్చునని, నేను అలాంటి విధానాలు నమ్ముతానని, గ్లోబలైజేషన్ సమయంలో వారు తమ మాటను కోల్పోయారని, ప్రజా సమస్యలపై పోరాడటంలో బాగా పని చేస్తున్నారని పవన్ అన్నారు. గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతున్న సమయంలో మావోయిస్టులను నిర్మూలించడం సాధ్యం కాదని అంటారు. తండ్రి నుంచే వామపక్ష ఉద్యమాల గురించి తెలుసంటారు.' అని ఆ మేగజైన్ కథనంలో పేర్కొన్నారు.

 పవన్ కళ్యాణ్‌కు వారు, వారికి పవన్

పవన్ కళ్యాణ్‌కు వారు, వారికి పవన్

ఇంకా, కామ్రెడ్ల సహచర్యంలో పవన్ హాయిగా ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని, వివిధ అంసాల మీద లెఫ్ట్ పార్టీలతో కలిసి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని, ఎన్నికల ముందే పొత్తు కుదిరిందని, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి కేడర్ బలం మీద పవన్ ఆధారపడవచ్చునని, అలాగే వామపక్షాల పునరుత్తేజం పొందేందుకు ఆయన స్టార్ బలాన్ని ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు.

సీనియర్ రాజకీయవేత్తగా నిరూపించుకునేందుకు

సీనియర్ రాజకీయవేత్తగా నిరూపించుకునేందుకు

గతంలో గందరగోళపు భావజాలంతో పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా ఉన్నందుకు, తన పాత మిత్రులైన టీడీపీ చేస్తున్న తప్పుల పట్ల నిర్లిప్తంగా ఉన్నందున ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారని, కానీ మార్చి 14వ తేదీన తానొక సీనియర్ రాజకీయవేత్తనని నిరూపించుకునే స్థాయిలో ఆయన తన హోదాను పునర్ నిర్వచించుకున్నారని, చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల అవినీతిని ఎండగట్టడం ద్వారా పవన్ దీనిని సాధ్యం చేశారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి బీజేపీకి బాగా తెలుసునని, అందుచేతనే వారిని నియంత్రించగలిగే స్థితిలో ఉందని, హోదాను కూడా ఇవ్వలేదని పవన్ అన్నారని ప్రస్తావించారు.

 జనసేన కింగ్ మేకర్

జనసేన కింగ్ మేకర్

రాజకీయ పరిశీలకులు మాత్రం టీడీపీపై పదేపదే దాడికి పూనుకోవడం అనేది పవన్ కళ్యాణ్ చేస్తున్న తెలివైన పనిగా అభివర్ణిస్తున్నారని, రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలను పసిగట్టే ఇలా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారని పేర్కొంది. 2019లో ఏ పార్టీకి మెజార్టీ రాదని పవన్ అన్నారని, 175 అసెంబ్లీ స్థానాలలో ఆయన పార్టీ చాలా సీట్లలో గెలుపోటమనులను ప్రభావితం చేయగల పాత్ర పోషించబోతోందని, ప్రత్యేకించి కాపులు మెజార్టీ ఉన్న నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఓ వైపు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగా తలపడుతున్న సమయంలో సీపీఎం, సీపీఐలతో కలిసి పవన్ బరిలోకి దిగుతుందని, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతుందనే అంచనాలు ఉన్నాయని పేర్కొంది. జనసేన కింగ్ మేకర్ కావొచ్చునని పేర్కొంది.

English summary
With his huge fan base and the left’s support, Pawan Kalyan hopes to win 2019 polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X