మిర్చికి క్వింటాల్ కు రూ.11వేలు చెల్లించాలి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మిర్చి రైతుకు క్వింటాల్ కు రూ.11 వేలు గిట్టుబాటు ధరను చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలకు సూచించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను రాశారు. లేఖ ప్రతిని ఆయన మీడియాకు మంగళవారం నాడు విడుదల చేశారు.

అయితే మిర్చి రైతుల కష్టాలకు పాలకులు కారణమనే అభిప్రాయాన్ని ఆ లేఖలో పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.అయితే ఈ లేఖ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసిందనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.

మిర్చి మార్కెట్ ధరకు, గిట్టుబాటు ధరకు చాలా వ్యత్యాసం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు మిర్చికి కనీసంగా రూ.11 వేలు చెల్లిస్తే ప్రయోజనం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

PawanKalyan demanded to government provide MSP to chilly farmers

ప్రభుత్వ వైఖరితో రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. ఎంత విస్తీర్ణంలో రైతులు మిర్చి సాగు చేశారనే విషయాలను చెప్పడం వ్యవసాయ శాఖ వైపల్యం చెందిందన్నారు.

విదేశీ కార్పోరేట కంపెనీలపై ఉన్న శ్రద్ద రైతులపై లేదని చెప్పారు పవన్. రైతు కన్నీరు పెట్టడం దేశానికి మంచిదికాదని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా పాలకులు మేల్కోని మిర్చి రైతుకు రూ.11 వేలను గిట్టుబాటు ధర చెల్లించాలని ఆయన కోరారు,.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena chief , cine actor PavanKalyan demanded to government provide MSP to chilly farmers. He wrote a letter on Tuesday. he demanded provide Rs.11,000 for Chilli farmers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి