"మోదీ కాళ్లు మొక్కి సీబీఐ విచారణ నుంచి బయట పడాలని కేటీఆర్ ప్లాన్"

కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేటీఆర్ నీ స్థాయి ఏంటి..? అని ప్రశ్నించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి నీకుందా కేటీఆర్..? అని మండిపడ్డారు. కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకునేందుకు మెప్పు కోసం బీజేపీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ధ్వజం ఎత్తారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనక బీజేపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. మోదీ మెప్పుకోసమే రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపకపోవడంతో మీ వైఖరి బట్టబయలు అయ్యింది. మీరు పరోక్షంగా ఎన్డీయే మద్దతు తెలిపారని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదన్నారు.

"కవిత వ్యాఖ్యలతో బీజేపీలో బీఆర్ఎస్ మానసికంగా విలీనం అయ్యిందని స్పష్టమైంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తారు కేటీఆర్. మ్మెల్యేల ఫిరాయింపు స్పీకర్ పరిధిలోని అంశం. ఓట్ చోరీ ప్రపంచవ్యాప్తంగా ఆరా తీస్తున్నారు. ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ బట్ట బయలు చేశారు. కాళేశ్వరం సీబీఐ విచారణ తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతల అగచాట్లు. కాళేశ్వరం కేసు విచారణ సీబీఐకి ఇవ్వమని కోరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదు. మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తున్నారు. కోట నీలిమకు నోటీసులు రాజకీయ కక్ష్య సాధింపు చర్య. ఈ చర్యను ఖండిస్తున్నాం" అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.

PCC Chief Mahesh Kumar Goud Blasts KTR for Criticizing Rahul Gandhi to Flatter Modi

"2017లో కోట నీలిమ కుటుంబం చిరునామా మార్చాలని ఎన్నికల కమిషన్‌కు ఫామ్‌-6 ఇచ్చినా ఈసీ చర్యలు తీసుకోలేదు. ఫామ్‌ - 6 ప్రకారం తమ విధులు సక్రమంగా నిర్వహించని ఈసీ ఇప్పుడు బీజేపీ ఒత్తిడితో కోట నీలిమకు నోటీసులిచ్చింది. కోట నీలిమకు నోటీసులపై న్యాయ పరంగా ముందుకు వెళతాం. కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి. 48 గంటల్లో కాళేశ్వరం అవినీతిని తేలుస్తామని అన్న కిషన్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యరూ. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంలో భాగంగానే కాళేశ్వరంపై విచారణ ఆగిందని భావిస్తున్నాం" అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+