సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించిన ఒకరు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయంగా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ , రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చెయ్యాలన్నారు. కొడంగల్ లో నిజంగా అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కొడంగల్ కు ప్రత్యేక గుర్తింపు తన హయాంలోనే వచ్చిందని పేర్కొన్న ఆయన కేటీఆర్ దత్తత తీసుకొని ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదంటూ ఆరోపించారు.

కొడంగల్ లో గెలిచిన ఎమ్మెల్యే ఏ విధమైన అభివృద్ధి చేయలేదని విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి, సిరిసిల్లను, సిద్దిపేటను అభివృద్ధి చేసినట్టుగా కొడంగల్ ను అభివృద్ధి చేయలేదంటూ ఆరోపించారు. కొడంగల్ కు సాగునీరు తేలేదని, కాలేజీలు రాలేదని, తాను చేసిన అభివృద్ధి తప్ప కొడంగల్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు కొడంగల్ రూపురేఖలను మారుస్తాయి అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, దేశ ముఖచిత్రంలో కొడంగల్ పేరు మారుమోగుతుంది అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి తనకు అధ్యక్ష పదవి ఇచ్చి సోనియాగాంధీ తనను రాష్ట్రం కోసం నియమించింది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలంతా ఆలోచన చేయాలని సూచన చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రంలో నియంత పాలన పోతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ను ప్రజలంతా తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications