CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్..
కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించిన సంగతి తెలిసిందే. మహేశ్ కుమార్ గౌడ్ నియామకాన్ని నేతలు స్వాగతించారు. మొదటి నుంచి పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన మహేశ్ కుమార్ గౌడ్ కు మంచి పదవి దక్కిందన్నారు. తాజాగా మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తను పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యేందుకు సహకరించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ మరింత బలపడడానికి కృషి చేస్తానని చెప్పారు. అయితే గత కొంత కాలంగా పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారని చర్చ జరిగింది. పీసీసీ రేసులో మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, బలరామ్ నాయక్, సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్, జగ్గారెడ్డితో పాటు పలువురు ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. బీసీ నేతకు పీసీసీ పదవి ఇవ్వడంపై బీసీ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు.#RevanthReddy
— Congress for Telangana (@Congress4TS) September 7, 2024
• @revanth_anumula
• @Bmaheshgoud6666 pic.twitter.com/hgfTABnCnx
NSUI నుంచి పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నిజామాబాద్ బీసీ నేతగా మహేష్ కుమార్ గౌడ్ కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు పీసీసీ బాధ్యతలు చూస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫ్రీ కానున్నారు. మహేష్ కుమార్ గౌడ్‌ను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంలో సామాజిక న్యాయంతో పాటు ప్రాంతీయ న్యాయం జరిగిందని అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. ఉత్తర తెలంగాణ నుంచి మహేష్ కుమార్ గౌడ్‌కి పీసీసీ చీఫ్ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications