వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరంతరం పని చేసినా కూడా ప్రజలతో తిట్టించుకునే సంస్థ పురపాలక శాఖ.!పట్టణ ప్రగతి సమీక్షలో కేటీఆర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న విభాగాల్లో పురపాలక శాఖ ప్రథమంగా నిలుస్తుందని, సంవత్సరం పొడుగునా ప్రతి రోజూ పని చేసినా, ప్రజల నుంచి ప్రత్యేకంగా ప్రశంసలు రావు సరికదా ఏదో ఒక కారణం వల్ల పురపాలక శాఖలో పని జరగకపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతాయన్నారు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. అందుకే ఈ శాఖలో ప్రజల కోసం పనిచేస్తున్న సమర్థవంతమైన అధికారులను, పురపాలక శాఖ తరఫున అభినందించేందుకు పట్టణ ప్రగతి పురస్కారాలను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతి పురస్కారాలు అందుకున్న అధికారులకు, పురపాలక సిబ్బందికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంను వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ రాష్ట్రంగా చెప్పవచ్చని కేటీఆర్ స్పష్టం చేసారు.

పట్టణ ప్రగతిపైన మంత్రి కేటీఆర్ సమీక్ష.. పాల్గొన్న మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు

ఉత్తమ అవకాశాలు, వసతుల కోసం ప్రజలు పట్టణాలకు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతుల కల్పన అత్యంత సవాలుగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. గత ఐదు వేల సంవత్సరాలుగా జరిగిన పట్టణీకరణకు ధీటుగా, రానున్న 50 సంవత్సరాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో గత ఏడు సంవత్సరాల్లో రెట్టింపయిన జీడిపీలో సింహభాగం పట్టణాల నుంచి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆలోచన మేరకు 68 గా పాలక వ్యవస్థలను 142కు పెంచామన్నారు కేటీఆర్. నూతన పురపాలక చట్టం తీసుకువచ్చి ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను చేపట్టామన్నారు కేటీఆర్.

ఎంత చేసినా తిట్లు తప్పవు.. మరింత అప్రమత్తంగా ఉండాలన్న కేటీఆర్

మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను స్థానిక పురపాలక సంస్థలపైన భారం వేయకుండా తాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అనేక ప్రధానమైన లక్ష్యాలను పురపాలక సంస్థలు సాధించాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేసారు. అందులో భాగంగా ప్రతి పట్టణంలో మోడల్ మార్కెట్లు, డిజిటల్ డోర్ నెంబరింగ్, ఆధునిక దోబీ ఘాట్ లు, మానవ వ్యర్థాల శుద్ధి మరియు నిర్వహణ ప్లాంట్ లు, మోడల్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ లు, వైకుంఠ ధామాలు, ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ తో పాటు బయో మైనింగ్ వంటి లక్ష్యాలను సాధించాలని కేటీఆర్ సూచించారు.

ప్రగతి ప్రస్థానం పైన ఒక నివేదికలు ఇవ్వండి.. నగరపాలక సంస్ధలను ఆదేశించిన మంత్రి కేటీఆర్

రానున్న వర్షా కాలంను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్దేశించిన హరితహారానికి సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రభుత్వం చట్టప్రకారం నిర్దేశించిన టి ఎస్ బి పాస్ ప్రకారం అనుమతులను 21 రోజుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. ఈ విషయంలో ఏ అధికారి గానీ ప్రజా ప్రతినిధి కానీ అవకతవకలకు పాల్పడితే, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే పట్టణాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో అద్భుతమైన ప్రగతి కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి పురపాలక సంస్థలు తన ప్రగతి ప్రస్థానం పైన ఒక నివేదికను సిద్ధం చేయాలన్నారు.

అభివృద్ది పనులు ప్రజలకు ఏకరువు పెట్టాలి.. యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన కేటీఆర్

జూన్ రెండవ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి పురపాలక సంస్థల్లో చేపట్టిన అభివృద్ధిని నగర పౌరుల ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలని,
త్వరలో పురపాలక శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని పూర్తి చేస్తామని, పురపాలక శాఖల్లో వార్డ్ ఆఫీసర్ల వ్యవస్థ, ఇందుకు సంబంధించిన సిబ్బంది నియామకం త్వరలో పూర్తి అవుతుందని మంత్రి కేటీఆర్ స్పస్టం చేసారు.

English summary
Minister Kalvakuntla Taraka Rama Rao said that the municipality was one of the areas where the government was constantly working hard for the people and although it worked every day throughout the year, it was not particularly appreciated by the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X