• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

 కొత్త జిల్లాలు ఏర్పడి మూడేళ్ళు అయినా అభివృద్ధికి ఆమడ దూరమే అంటున్న ప్రజలు 

|

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది. అయినా అవి అస్తిత్వాన్ని చాటుకోలేకపోతున్నాయి. పాత జిల్లాల ఉనికి ఇంకా అలాగే ఉంది. ఇప్పటికి 33 కొత్త జిల్లాలలో అభివృద్ధి కూడా పెద్దగా లేదని చెప్పక తప్పదు. జిల్లాలుగా విభజిస్తే పాలనా సౌలభ్యం ఎక్కువగా ఉంటుందని, జిల్లా అధికారులు గ్రామస్థాయిలో కి వెళ్లి కార్యక్రమాలు చేయడానికి వీలు ఉంటుందని, త్వరిత గతిన అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి 11 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం చేతికి పోలవరం!? జగన్ కు కాదు..ఆ ఇమేజ్ మనకే దక్కాలి: బీజేపీ కొత్త ఎత్తుగడ..!

 తెలంగాణలో కొత్త జిల్లాల అస్తిత్వం ప్రశ్నార్ధకం

తెలంగాణలో కొత్త జిల్లాల అస్తిత్వం ప్రశ్నార్ధకం

2016 అక్టోబర్ 11న తొమ్మిది జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు . అప్పుడు ప్రభుత్వం ఇరవై రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది.ఇకఇటీవల మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరింది. అయినా నేటికీ ఆయా జిల్లాల ప్రజలు మీది ఏ జిల్లా అని ప్రశ్నిస్తే ఉమ్మడి వరంగల్ అనో , పూర్వ ఖమ్మం అనో ఇలా పాత జిల్లాల పేర్లు చెబుతున్నారు కాని కొత్త జిల్లాల ఊసే ఎత్తడం లేదు. అందుకు కారణం కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ జిల్లాలో అభివృద్ధి పెద్దగా జరగకపోవడంతో, ప్రజలు కొత్త జిల్లాల మార్పును గుర్తించలేకపోతున్నారు.

అభివృద్ధిపై దృష్టి సారించని సర్కార్

అభివృద్ధిపై దృష్టి సారించని సర్కార్

ఇక అధికారులు సైతం ఇప్పటివరకు గ్రామస్థాయిలో కి వెళ్లి చేసిన అభివృద్ధి పెద్దగా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కి వెళ్ళిన ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గతంలో పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కాస్తోకూస్తో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ఇక గత ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పైన, రాష్ట్ర ప్రగతి పైన పెద్దగా దృష్టి సారించిన దాఖలాలే లేవు.

 మౌలిక వసతులు లేక ఇబ్బందుల్లో కొత్త జిల్లాల వాసులు

మౌలిక వసతులు లేక ఇబ్బందుల్లో కొత్త జిల్లాల వాసులు

ఫలితంగా అటు నగరాల్లోనూ , పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం రోడ్లు , డ్రైనేజ్ లు, తాగు నీటి వసతి లేని గ్రామాలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాలు ఏర్పడినా ఆ సంతోషం ప్రజల్లో లేదు. అందుకే ప్రజలు కొత్త జిల్లాలను గుర్తించడం లేదు. నేటికీ పాత జిల్లాలే అస్తిత్వం చాటుకుంటున్న పరిస్థితి నెలకొంది. సీఎం కెసిఆర్ ఆలోచనా విధానం ఒకటైతే, కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో అది ఆచరణలో సాధ్యం కాలేదు. సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై పెట్టిన విజన్ , కొత్త జిల్లాలను ప్రగతి బాటలో నడిపించటంపై పెట్టలేదు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అభివృద్ధిలో ఆమడ దూరం అంటూ అసహనం

అభివృద్ధిలో ఆమడ దూరం అంటూ అసహనం

జిల్లాలు ఏర్పడిన జిల్లా వాసుల సమస్యలు తీరలేదు. అందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన అభివృద్ధిలో ఇంకా ఆమడ దూరంలో అన్నట్టే ఉన్నామని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు మారాలని చిన్నచిన్న జిల్లాలు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల సమస్యలు కూడా తీరాలని, కనీస వసతులు కల్పించడంలో సర్కార్ చొరవ చూపాలని కోరుతున్నారు ప్రజలు.

English summary
Three years after the formation of new districts in the state of Telangana. Yet they are not able to exist. The existence of the old districts is still intact. Needless to say, there are no major developments in 33 new districts so far. CM KCR decided to change the 11 districts into 33 districts, considering that the administrative facilities will be divided into districts, that the district authorities will be able to go to the village level and make a rapid development
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more