హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ బిర్యానీ, టీ అమ్ముకున్న మోడీ, భారత్ మాకు ఆదర్శం: ఇవాంకా

హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంకా ట్రంప్ మంగళవారం ప్రారంభించారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

GES 2017: Ivanka Trump Says,Modi's Rise From Tea Seller Is Exemplary

హైదరాబాద్: హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంకా ట్రంప్ మంగళవారం ప్రారంభించారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మాట్లాడారు.

<strong>ఏపీలోను నిర్వహించాం: గ్లోబల్ సదస్సుకు బ్రాహ్మణి, చెర్రీ సతీమణి ఉపాసన </strong>ఏపీలోను నిర్వహించాం: గ్లోబల్ సదస్సుకు బ్రాహ్మణి, చెర్రీ సతీమణి ఉపాసన

అంతకుముందు, మోడీ, ఇవాంకాలు వేర్వేరుగా ప్రాంగణానికి చేరుకున్నారు. కాసేపు ఇద్దరు భేటీ అయ్యారు. ఇరుదేశాల విదేశాంగ శాఖ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సదస్సు ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సదస్సు ప్రారంభమయ్యాక ఇవాంకా మాట్లాడారు.

<strong>తెలుగు రాష్ట్రాల్లో మొదటిది: హైదరాబాద్ మెట్రో కోసం మెగా ఫ్యామిలీ హీరో వెయిటింగ్</strong>తెలుగు రాష్ట్రాల్లో మొదటిది: హైదరాబాద్ మెట్రో కోసం మెగా ఫ్యామిలీ హీరో వెయిటింగ్

చదవండి: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ మరిన్ని కథనాలు

భారత్ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ

ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోందని ఇవాంకా ట్రంప్ అన్నారు. 150 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు శుబాకాంక్షలు అన్నారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అని చెప్పారు. కొత్త ఆవిష్కరణలకు ముందుకు వస్తున్న యువతకు స్వాగతం అన్నారు.

అందమైన భారత దేశం, నిజమైన మిత్రుడు

భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రుడిని దాటి మార్స్ వరకు వెళ్లిందని ఇవాంకా కితాబిచ్చారు. అమెరికాకు భారత్ నిజమైన మిత్రుడు అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నిత్యం చెబుతుంటారని తెలిపారు. అందమైన భారత దేశానికి రావాలని తమకు ఆహ్వానం అందిందని ఇవాంకా చెప్పారు.

ప్రపంచ ప్రఖ్యాత బిర్యానీకి హైదరాబాద్ పుట్టినిల్లు

ప్రపంచ ప్రఖ్యాత బిర్యానీకి హైదరాబాద్ పుట్టినిల్లు అని ఇవాంకా ట్రంప్ అన్నారు. టి హబ్ ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్‌హగా వాసికెక్కుతుందని తెలిపారు. ప్రజల జీవన పరిణామానాల్లో మార్పులు తెచ్చేందుకు ఔత్సాహికులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కాంక్ష వదలకుండా కృషి చేయాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్

తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్

ఒక స్థాయికి చేరుకున్న వ్యాపారవేత్తలకు శుభాభినందనలు అన్నారు. 70 ఏళ్ల భారత ప్రజాస్వామ్యానికి నా వందనాలు అని ఇవాంకా అన్నారు. గత సదస్సు నుంచి ఈ సదస్సుకు మహిళా భాగస్వామ్యం పెరిగిందని చెప్పారు. ఆతిథ్యం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని చెప్పారు. అమెరికాలో కోటి పది లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారన్నారు.

మార్పు సాధ్యమని మోడీ నిరూపించారు

మార్పు సాధ్యమని మోడీ నిరూపించారు

మార్పు సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ నిరూపిస్తున్నారని కితాబిచ్చారు. మోడీ పాలనలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. భారత్‌ను పేదరికం నుంచి బయటపడేసేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య విజయానికి భారత్ ఆశాదీపంగా ఎదుగుతోందన్నారు. టీ అమ్ముకునే స్థాయి నుంచి మోడీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్వితీయం అన్నారు.

నా పిల్లలను హైదరాబాద్ స్కూళ్లకు పంపించాలని ఉంది

నా పిల్లలను హైదరాబాద్ స్కూళ్లకు పంపించాలని ఉంది

హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతోందని ఇవాంకా అన్నారు. హైదరాబాద్ నగరంగా ఎదుగుతోందన్నారు. నా పిల్లలను హైదరాబాదులోని పాఠశాలలకు పంపించాలని అనుకుంటున్నానని చెప్పారు. ఎంతోమంది మహిళలు ఉత్పాదక రంగంలోకి దూసుకు వస్తున్నారని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు, సహాయ, సాంకేతికతలు అందించాలని చెప్పారు.

నైతిక నియంత్రణలు అడ్డుగా ఉన్నాయి

నైతిక నియంత్రణలు అడ్డుగా ఉన్నాయి

చాలా దేశాల్లో నైతిక నియంత్రణలు మహిళల ఉన్నతికి అడ్డుగా ఉన్నాయని ఇవాంకా వాపోయారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చాలా అవసరమని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల్లో మహిళలకు మార్గదర్శనానికి ఇంకా కృషి అవసరమని చెప్పారు. భారత ప్రజలు మాకు అందరికీ ఆదర్శమని ఇవాంకా చెప్పారు.

English summary
Ivanka Trump, adviser and daughter of United States President Donald Trump, arrived in India early on Tuesday morning for the three-day Global Entrepreneurship Summit in Hyderabad.హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంకా ట్రంప్ మంగళవారం ప్రారంభించారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మాట్లాడారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X