Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్యాంకులకు వరుస సెలవులు, ఇక్కట్లలో ప్రజలు

అసలే కరెన్సీ కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు బ్యాంకులకు వరుస సెలవులు రావడం మరింత ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఈ సెలవుల కారణంగా మరింత కరెన్సీ కష్టాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయంతో ఉన్నారు ప్రజలు. సోమవారం

హైదరాబాద్ :అసలే కరెన్సీ కోసం ప్రజలు అల్లాడుతోంటే , బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద నగదు నోట్ల రద్దుతో ఊపిరి సలకుండా పనిచేస్తోన్న బ్యాంకు సిబ్బందికి ఈ సెలవులు కొంత ఊరటనిస్తున్నాయి.శని, ఆదివారంతో పాటు, భారత్ బంద్ కారణంగా సోమవారం నాడు బ్యాంకులు ఏ మేరకు పనిచేస్తాయననే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఇబ్బందులు ఇంకా తీరలేదు. కొత్త ఐదు వందల రూపాయాల నోటు హైద్రాబాద్ కు చేరుకొన్నా ఇంకా సామాన్యుల చెంతకు చేరలేదు. ఎటిఎంలు కూడ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. కొన్ని ఎటిఎంలలోనే రెండువేల రూపాయాల నగదును మాత్రమే ఉంచుతున్నార. ఈ నగదు కూడ డిపాజిట్ చేసిన కొద్ది గంటల్లోనే ఖాళీ అవుతోంది.

ఎటిఎంలను కాదని బ్యాంకుల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.అయితే తాజాగా బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో సామాన్యుల కష్టాలు మరింత రెట్టింపు కానున్నాయి. నెలాఖరుకావడం, వేతనాల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు బ్యాంకులకు క్యూ కడతారు. ఈ వారంలో బ్యాంకులు, ఎటిఎం ల వద్ద విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంది.

people in trouble continues holidays for banks

తాజాగా బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి.ఈ సెలవుల ప్రభావం కూడ ప్రజలపై కన్పిస్తోంది.ప్రతి నెలా రెండవ, నాలుగవ శనివారాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటిస్తారు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా రద్దు చేసిన నగదును మార్చుకొనేందుకుగాను రెండవ శనివారం రోజున బ్యాంకులు పనిచేశాయి. నాలుగవ శనివారం నాడు బ్యాంకులకు సెలవును ప్రకటించారు.

ఆర్ బిఐ సూచలన మేరకు పాత నగదు మార్పిడి, రద్దు చేసిన నగదు డిపాజిట్ల కోసం బ్యాంకు అధికారులు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. తాజాగా వచ్చిన సెలవులు బ్యాంకర్లకు కొంత విశ్రాంతి లభించింది.నాలుగవ శనివారం కారణంగా నవంబర్ 26వ, తేదిన బ్యాంకులకు సెలవు, మరునాడు ఆదివారం సెలవు దినం. వరుసగా రెండు రోజులు సెలవులు లభించాయి. నవంబర్ 28వ,తేదిన విపక్షాలు బారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా సోమవారం నాడు కూడ బ్యాంకులు పనిచేయడం ఇబ్బందే.

బంద్ కారణంగా ఇతర ప్రాంతాల నుండి బ్యాంకులకు వెళ్ళే అధికారులు సకాలంలో వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా రాజకీయపార్టీలు బంద్ కారణంగా బ్యాంకులు ఇతర వాణిజ్య సంస్థలను మూసివేయించే పరిస్థితులున్నాయని ప్రజలు అభిప్రాయంతో ఉన్నారు. అయితే సోమవారం నాటి బంద్ కు తెలంగాణ లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్, ఆంద్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టిడిపి లు మద్దతు పలకలేదు. ఈ కారణంగా బ్యాంకులు సడిచేందుకు దోహదపడతాయనే ఆశ కూడ లేకపోలేదు. అధికారికంగా బ్యాంకులకు సెలవు లేకపోయినా బ్యాంకు అధికారులు తమ అంతర్గత పనులు చేసుకొంటారు. బంద్ ప్రభావం పూర్తిగా కన్పిస్తే బ్యాంకు ప్రజలకు బ్యాంకు సేవలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+