హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్, టీఆర్ఎస్ దీక్షలకే అనుమతిస్తారా? బీజేపీకి ఎందుకివ్వరు?: బండి సంజయ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ..
ఆ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద గురువారం తలపెట్టిన 'ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష'కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత హేయమైన చర్య అన్నారు.

ప్రజాస్వామ్య గొంతు నులిమేసే కుట్ర అని, సీఎం కేసీఆర్ ధర్నా చేస్తే ఒప్పు... బీజేపీ దీక్ష చేస్తే తప్పా? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం? ప్రజాస్వామ్యవాదులారా మౌనం వీడండి అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ 'ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష'ను కొనసాగించి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు, ఆందోళనలు చేసే వేదిక ఇందిరాపార్క్ ధర్నా చౌక్ అని, ట్రాఫిక్ జాం, ప్రజలకు ఇబ్బంది పేరుతో ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టబోయే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగిస్తోందన్నారు బండి సంజయ్.

Permission denied for BJP protest at indira park: bandi sanjay fires at cm kcr

ఇందిరాపార్క్‌ను ధర్నా చౌక్‌గా పునరుద్దరించిన తరువాత టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు నిర్వహించాయని గుర్తు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశాయని, అప్పుడే లేని ఇబ్బంది బీజేపీ దీక్ష చేపడతానంటేనే వస్తోందా..? అని బండి సంజయ్ అటు ప్రభుత్వాన్ని, ఇటు పోలీసులను నిలదీశారు.

తెలంగాణ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి

Recommended Video

Telangana లో కూడా BJPదే విజయం - Bandi Sanjay | Oneindia Telugu

కృష్ణా నదీ జలాల కేటాయింపులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంతోపాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కోరారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాల సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డిలతో కలిసి పార్లమెంట్ హౌజ్ లోని జలవనరుల శాఖ మంత్రి కార్యాలయానికి వెళ్లారు బండి సంజయ్. కేంద్ర మంత్రి షెకావత్‌ను కలిసి కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వివరించారు. ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేదని ఈ సందర్భంగా బండి సంజయ్ సహా బీజేపీ నేతలు పేర్కొన్నారు. కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తేనే తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారమవుతుందని, తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు.

English summary
Permission denied for protest at indira park: bandi sanjay fires at cm kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X