ముద్దు పెడతారా? బిల్డింగ్ పై నుండి తోసెయ్యమంటారా? విద్యార్థినులతో పీఈటీ
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు పెడదారి పడుతున్నారు. తల్లి, తండ్రి, గురువు దైవం తో సమానం అన్న మాటకు అర్థం లేకుండా చేస్తున్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గ్రామంలో స్థానిక ఉన్నత పాఠశాల పి ఈ టి సంగ్రామ్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు . విద్యార్థినులను వేరువేరుగా పాఠశాల భవనం పైకి తీసుకు వెళ్లి భయపెట్టేవాడు, ముద్దు పెడతారా లేదా బిల్డింగ్ పై నుండి కిందకు తోసేయ్యమంటారా అంటూ విద్యార్థులను బెదిరించేవాడు. ఇక ఇటీవల పాఠశాల ప్రారంభమైనప్పటికీ ఆ విద్యార్థినులు పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతూ ఇంట్లోనే ఉండిపోయారు.

పీఈటీ పాఠశాలలో ఉన్నాడు అంటే తాము స్కూల్ కి వెళ్ళమని విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు గ్రామస్థులతో కలిసి పాఠశాలకు వెళ్లి సదరు పీఈటీ కి దేహశుద్ధి చేశారు. సదరు పీఈటీ ని పోలీసులకు అప్పగించారు. ఇక ఈ వ్యవహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ పైన కూడా వారు దాడి చేశారు.
హోం గార్డ్ గ్రామస్తులను దూషించటంతో అతని పైన కూడా దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకున్న డీఈవో వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు తల్లిదండ్రులతో మాట్లాడి పిఈటితో పాటు ప్రధానోపాధ్యాయుని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు.
హోం గార్డ్ పైన చర్యలు తీసుకుంటామని, పిఈటి పైన కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. ఇలాంటి ఘటనలు సభ్య సమాజానికి ఇబ్బందికర పరిస్థితులను కలిగిస్తున్నాయి. స్కూల్స్ లో ఇలాంటి వాతావరణం మారకపోతే విద్యార్థుల భవిష్యత్ ఇబ్బందులలో పడుతుంది.












Click it and Unblock the Notifications