వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుకున్నంతా అయింది.. రాంగోపాల్ వర్మపై కోర్టులో పిటిషన్ దాఖలైంది

అనుకున్నంతా అయింది.. సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలైంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనుకున్నంతా అయింది.. సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలైంది.

సినీ పరిశ్రమను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ బాహుబలిలా మీడియాకు కనిపిస్తున్నారని వర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వర్మ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ న్యాయవాది రంగప్రసాద్ రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.

 Petition Filed against Director Ramgopal Varma in Rangareddy Court

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిలా మీడియా చూపిస్తున్నదంటూ ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు.

'సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్‌ తీసుకున్న స్కూల్‌ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా?' అని రాంగోపాల్ వర్మ నిలదీశారు.

సంచలనం రేపుతున్న డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా వర్మ వ్యాఖ్యలు చేశారని, ఇలా వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమేనని రంగప్రసాద్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసుతో వర్మకు సంబంధం లేదని, అయినా ఎక్సైజ్ అధికారులను కించపరిచే విధంగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వర్మ వ్యాఖ్యలు చేశారని రంగప్రసాద్‌ తెలిపారు.

ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించే విధంగా వ్యవహరించడం, వ్యాఖ్యలు చేయడం ఐపీసీ సెక్షన్‌ 343 ప్రకారం చట్టవిరుద్ధమని, ఇలా ప్రవర్తించినందుకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు కూడా జైలుశిక్ష పడే అవకాశముందని ఆయన చెప్పారు.

సినీ ప్రముఖుల తరహాలోనే డ్రగ్స్‌ తీసుకున్న స్కూలు పిల్లలను కూడా పిలిచి గంటలు గంటలు విచారిస్తారా? అని వర్మ ప్రశ్నించడం తగదని.. దేశంలో మైనర్లు, మేజర్లకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని రంగప్రసాద్‌ అన్నారు.

ఎక్సైజ్‌ శాఖను అవమానపరిచే విధంగా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని, పోలీసు, ఎక్సైజ్‌ శాఖలపై ప్రజల్లో గౌరవముందని, దానిని దెబ్బతీయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
A Case was filed against Director Ramgopal Varma in Rangareddy Court on Tuesday. Advocate Rangaprasad filed this case against him and told that Director Ramgopal Varma made inappropriate comments regarding Exicise Director Akun Sabharwal and about the process of enquiry. He questioned SIT officials that they are targeted Cine Industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X