పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ కోర్టులో పిటిషన్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణలో ఓ పిటిషన్ దాఖలైంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పవన్ కల్యాణ్ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు సోమవారం(అక్టోబర్ 14) ఈ పిటిషన్ వేయడం జరిగింది.శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుమాంసంతో చేసిన నెయ్యిని కలిసిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వాఖ్యలు ఉన్నాయి. ఇదే సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ తన హోదా మరచి వివాదస్పద వాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టింది. ఇంటర్నెట్‌లో పవన్ మాట్లాడిన వీడియోలు డిలీట్ చేయాలని న్యాయవాది ఇమ్మనేని రామారావు తన పిటిషన్‌లో కోరారు. తిరుపతి లడ్డూ వివాదంలో సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని, సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తే, ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం పవన్ కల్యాణే. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారాయన. తాను బలమైన సనాతన ధర్మం పాటించేవాడనని ఆయన చెప్పుకొచ్చారు.
హిందూ ధర్మాన్ని కాపాడటానికి తాను ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాననంటూ గొప్పగా మాట్లాడారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంతో పాటు, వాటికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కోరారు.












Click it and Unblock the Notifications