బెదిరింపులంటూ బాబుపై పిటిషన్: ఫోన్ ట్యాపింగ్‌పై వారిపై గురి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులపై బెదిరింపు థోరణులతో వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి వర్గ సహచరులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈమేరకు సోమవారంనాడు హసన్ షరీఫ్ అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులు సండ్ర వెంకట వీరయ్య, మత్తయ్యను దాచిపెట్టి నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ మెమోను కోర్టు స్వీకరించింది.

కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నలుగురు అఖిల భారత సర్వీస్ అధికారులు చిక్కుల్లో పడుతారా అనే సందేహం కలుగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి ఇచ్చిన తెలంగాణ హోం శాఖ కార్యదర్సి బుర్రా వెంకటేశం, ఎసిబి చీఫ్ ఎకె ఖాన్, నిఘా విభాగం చీఫ్ శివధర్ రెడ్డి, ప్రత్యేక నిఘా విభాగం చీఫ్ విసి సజ్జనార్‌లకు నోటీసులు జారీ చేసే విషయంపై ఆంధ్రప్రదేశ్ సిఐడి నోటీసులు జారీ చేసే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
కాగా, నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడు జెరూసలం మత్తయ్యకు ఆశ్రయం కల్పించారని నిరూపించడానికి విజయవాడ పోలీసు ఉన్నతాధికారి ఎబి వెంకటేశ్వర రావుపై సాక్ష్యాలను తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నట్లు వినికిడి. మత్తయ్యకు పోలీసులే రక్షణ కల్పించారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications