హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Petrol Diesel hike : ఆగని బాదుడు... దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు...

|
Google Oneindia TeluguNews

పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఆదివారం(జులై 4) మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు,లీటరు డీజిల్‌పై 18 పైసలు ధర పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.103.41కి,లీటర్ డీజిల్ ధర రూ.97.40కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఏకంగా లీటరు పెట్రోల్ ధర రూ.105.58కి చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.44కి చేరింది.

LPG gas cylinder price hike: సామాన్యుడిపై మరో భారం... రూ.25 పెరిగిన వంట గ్యాస్ ధరLPG gas cylinder price hike: సామాన్యుడిపై మరో భారం... రూ.25 పెరిగిన వంట గ్యాస్ ధర

దేశవ్యాప్తంగా మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకూ 34 సార్లు పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుత జులై నెలలో శనివారం(జులై 3) ఒక్కరోజు మినహా నిత్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.గడిచిన రెండు నెలల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.9.11,లీటర్ డీజిల్ ధర రూ.8.63 మేర పెరిగింది. అంతర్జాతీయంగా ముడి చుమురు ధరలు పెరగడం,విదేశీ మారకం హెచ్చు తగ్గుల కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నట్లు చెబుతారు. అయితే ఆ ప్రభావం కంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల కారణంగానే ఇంధన ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి.

petrol diesel prices hike again across india here is the latest price

సాధారణంగా లీటరు పెట్రోల్ ధర రూ.30కి కాస్త అటు,ఇటుగా ఉంటుంది. కానీ అటు కేంద్రం,ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డీజిల్‌పై దాదాపు రూ.30 పన్ను వసూలు చేస్తుండటంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి రాకముందు లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.9.48గా ఉండేది. ఇప్పుడది దాదాపు రూ.32 పైనే ఉంది.

ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు,మరోవైపు పెట్రోల్,డీజిల్ ధరలు సామాన్యుడికి పెను భారంగా మారుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వంట గ్యాస్ ధర కూడా పెరుగుతూనే ఉంది. ఇటీవలే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేర పెరిగింది. గడిచిన ఆర్నెళ్లలో వంట గ్యాస్ ధర రూ.140 మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం 14.2కేజీల సిలిండర్ ధర మార్కెట్లో రూ.850గా ఉంది.

English summary
Petrol and diesel prices today on 04 July 2021: Petrol and diesel prices on Sunday hiked across the country. Going by the prices, the petrol prices in Hyderabad remained at Rs. 103.41 with a hike of 36 paise and diesel at Rs. 97.40 with a hike of 20 paise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X