Phone tapping case: నార్కో టెస్టులకు రెడీ; రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి దమ్ముందా?
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాజాగా మరో మారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే నార్కో అనాలసిస్, లైట్ డిటెక్టర్ టెస్ట్ లకైనా నేను సిద్ధంగా ఉన్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: కేటీఆర్
తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు తనతోపాటు లైట్ డిటెక్టర్, నార్కో అనాలసిస్ టెస్ట్ లకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తన ఫోన్ తో పాటుగా రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గంలోని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల ఫోన్లను, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

ఆ దమ్ము రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి లేదు
తాము ట్యాప్ చేయడం లేదని చెప్పే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేంద్రం పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలోని ప్రతి ప్రతిపక్ష నాయకుడి ఫోన్లను ట్యాప్ చేస్తుందని, కాదని చెప్పే ధైర్యం కిషన్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ప్రజల ముందు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తను ఏ పరీక్షకైనా సిద్ధమన్న మాజీ మంత్రి కేటీఆర్, గన్ పార్క్ అయినా మరే బహిరంగ వేదిక మీద అయినా తాను చర్చకు సిద్ధమన్నారు.
కోర్టులో నిరూపించాలని కేటీఆర్ సవాల్
ఏ పరీక్షల కైనా తాను రెడీగా ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద ఒక అధికారిక ప్రకటన అయినా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రతిరోజు మీడియాకు లీకులు ఇస్తున్న లీక్ వీరుడు ఈ అంశం మీద ఇప్పటివరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రశ్నించారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆ ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలని, కోర్టులో నిరూపించాలని కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వం నీదే కదా.. నిన్నెవరు ఆపుతున్నారు
ప్రభుత్వం నీదే కదా నిన్ను ఎవడు ఆపుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్ నీకు సత్తా ఉంటే నీ ప్రభుత్వానికి దమ్ముంటే ఆధారాలతో కోర్టు ముందు నిలబెట్టడం అంటూ సవాల్ విసిరారు. తప్పు చేసిన వాడిని శిక్షించాలన్నారు. కాంగ్రెస్ హయాం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మన్మోహన్ సింగ్ ఫోన్ టాపింగ్ పై మాట్లాడిన మాటలను కేటీఆర్ ప్రస్తావనకు తెచ్చారు.
వారిపై పరువునష్టం దావా అందుకే వేశా
తనకు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని ఎంత చెప్పినా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న మంత్రులకు అందుకే నోటీసులు ఇచ్చానని పరువు నష్టం దావా వేశానని చెప్పారు. కేంద్రంలోని బీజేపీని రాష్ట్రంలోని కాంగ్రెస్ ను తిట్టిపోశారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో భయపడేది లేదని, ఆధారాలు ఉంటే నిరూపించి శిక్షించాలన్నారు.
-
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications