Phone Tapping: అమెరికా నుంచి ప్రభాకర్ రావు ఫోన్.. ఎందుకంటే..!
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అధికారుల మెడకు చుట్టుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ నిందితుడిగా ఇంటెలిజెన్స్ మాజీ చీప్ ప్రభాకర్ రావు పేరును చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాకర్ రావు ప్రస్తుతం దేశంలో లేడు. ఆయన అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను ఏ వన్ గా చేర్చడంపై ప్రభాకర్ మొదటి సారిగా స్పందించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఓ ఉన్నత అధికారికి ఫోన్ చేసినట్లు తెలిసింది.
తను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చినట్లు సదరు అధికారికి చెప్పినట్లు తెలిసింది. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం చెబితే ఎలా పని చేస్తున్నారో.. అప్పుడు అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు పని చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. మనం మనం పోలీసులమని.. పోలీసుల ఇళ్లలో సోదాలు ఎందుకని.. ప్రభాకర్ రావు ప్రశ్నించినట్లు తెలిస్తోంది. అయితే ఏదైనా చెప్పాలనుకుంటే మెయిల్ చేయాలని చేయాలని సదరు అధికారి ప్రభాకర్ రావుకు సూచినట్లు తెలిసింది. దీంతో ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేసినట్లు సమాచారం.

ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లినట్లు తెలిసింది. ఈ కేసులు విచారణ అనంతరం ప్రభాకర్ రావును ఏ వన్ గా పోలీసులు తేల్చారు. అలాగే ప్రభాకర్ రావు ఇళ్లలో కూడా సోదాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ పని చేస్తున్న ప్రణీత్ రావు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో పాటు ప్రణీత్ రావు అండ్ టీమ్ పలువురి వద్ద భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ప్రణీత్ రావు, భజంగ రావు, తిరుపతన్న పోలిటిషియన్స్ తో పాటు 36 మంది బిల్డర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలిసింది
వారు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు.. ఎంత మంది వద్ద పైసలు వసూళ్లు చేశారు అనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరంగానే పరిగణిస్తారు. కేవలం కొన్ని డిపార్ట్ మెంట్లకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది. అది కూడా నేరాస్థులు, తీవ్రవాదుల ఫోన్ ట్యాప్ చేయాలి. అంతేగానీ.. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయకూడదు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications