హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తోటి మహిళా ఉద్యోగినిపై మోజు బంధించి లైంగికంగా వేధించిన టెక్కీ ఇతనే (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తోటి ఉద్యోగినిపై మోజు పడి వివాహం చేసుకోకపోతే ఆమె తండ్రిని చంపేస్తానంటూ బెదిరించి, ఆమెను నిర్బంధించి, లైంగిక వేధించాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తండ్రిని చంపేస్తానని ఆమెను దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రప్పించాడు. ఐదు రోజులగా ఆమెను బందీని చేసి వేధించాడు. కత్తితో బెదిరిస్తూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైగింక వేధింపులకు పాల్పడ్డాడు.

చెప్పిన మాట వినకపోతే పెట్రోలు పోసి తగులబెడతానంటూ సైకోలా ప్రవర్తించాడు. తన ప్రాణాలు దక్కవని గ్రహించిన ఆ యువతి బెంగళూరులో ఉన్న తన సోదరుడికి రహస్యంగా సమాచారం పంపించింది. ఆమె సోదరుడు, స్నేహితుడు హైదరాబాద్ షీ టీమ్స్ ఇన్‌చార్జి స్వాతి లక్రాను ఆశ్రయించడంతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీపీ కవిత నేతృత్వంలోని బృందం టోలిచౌక్‌లో నిర్బంధించిన యువతిని రక్షించారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. మూడు నెలల క్రితం వరకు నగరంలోని డెల్ కంపెనీలో పని చేస్తున్న సమయంలో దుబాయ్‌కి చెందిన యువతి(24), తోటి ఉద్యోగి అయిన ఉత్తర్‌ప్రదేశ్ అలీఘడ్‌కు చెందిన సయ్యద్ ఇమద్ హసన్(26)తో స్నేహంగా ఉన్నారు.

Photo: Man arrested for sexually assaulting a girl

ఆమెకు దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయింది. అయితే, ఇమద్ హసన్ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఫేస్‌బుక్, సెల్‌ఫోన్లలో ఆమెతో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడి ఐదు రోజు క్రితం నగరానికి రప్పించాడు.

యువతి రాగానే టోలిచౌక్‌లోని తన గదిలో నిర్భంధించి చిత్ర హింసలకు గురి చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు బెంగళూరు నుంచి వచ్చి షీటీమ్స్‌ను ఆశ్రయించాడు. నిందితుడిని హుమాయిన్‌నగర్ పోలీసులకు అప్పగించి అతడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు జాయింట్ సీపీ తెలిపారు. హైదరాబాద్ షీ టీమ్స్ స్సందించిన తీరుతో బాధిత యువతి, ఆమె సోదరుడు పోలీసులను ప్రశంసించారు.

English summary
A man working in a software company kidnapped his colleague and sexually assaulted against her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X