శివుడిగా కెసిఆర్: కృష్ణార్జునులుగా హరీష్, కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అల్లుడు హరీష్ రావు, తనయుడైన ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అర్జునుడిగా హైదరాబాదులో ఫ్లెక్సీలు వెలిశాయి. శివుడిగా కెసిఆర్‌ను చిత్రీకరిస్తూ వెలిసిన ఫ్లెక్సీల పట్లనే విశ్వ హిందూ పరిషత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా ఈ కొత్త ఫ్లెక్సీలు కూడా చోటు చేసుకోవడం గమనార్హం.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును శివుడి రూపంలో చిత్రీకరించి రూపొందించిన ఫ్లెక్సీలు మంగళవారం హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో కలకలం రేకెత్తించాయి. శివుడి రూపంలో కెసిఆర్ ఫ్లెక్సీలను ముద్రించి, ప్రదర్శించటం తమ భక్త్భివాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందంటూ బజరంగ్‌దళ్, విశ్వహిందూపరిషత్ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.

ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాల్లో బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు ధర్నాలు కూడా చేపట్టడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంతేగాక, ఇందుకు నిరసనగా ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఫ్లెక్సీను ముద్రించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఇదిలా ఉండగా మెదక్ జిల్లా ఆందోల్‌లో కృష్ణార్జునుల రూపంలో బావమరుదులు మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్‌ల ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర సమితికి కెటి రామారావు, హరీష్ రావు కీలకమనే విషయం అందరికీ తెలిసిందే.












Click it and Unblock the Notifications