హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డు ఇలా, తడిసి ముద్దైన యువతులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. శనివారం కురిసిన వర్షంతో రహదారులపై వర్షపునీరు నిలిచిపోయింది.

తిరుమలగిరి పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, నాంపల్లి, రామ్ నగర్ ప్రాంతాల్లో వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి.

శనివారం ఉదయం నుంచి కురిసిన చిరుజల్లులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలు ప్రాంతాల్లో ప్రజలకు బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి.

 వర్షం

వర్షం

పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరవ్యాప్తంగా శనివారం 9.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 వర్షం

వర్షం

తిరుమలగిరిలో అత్యధికంగా 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా మిరిలాంలో 0.25 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

 వర్షం

వర్షం

ఆదివారం నగరంలో ఇదే పరిస్థితులుంటాయని, పలు ప్రాంతాల్లో మోస్తారుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారి వైకే రెడ్డి తెలిపారు.

 వర్షం

వర్షం

వాతావరణంలో తరుచూ చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా నెలరోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరగటంతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు ఒకింత ఉపశమనం కల్గింది.

 వర్షం

వర్షం

తుఫాను కారణంగా శనివారం నగరంలో చిరుజల్లులు కురిశాయి. అయితే, ఎప్పటిలాగే అడుగడుగున నగరవాసులకు చిక్కులెదురయ్యాయి.

 వర్షం

వర్షం

నిత్యం రద్ధీగా ఉండే పలు ప్రాంతాల్లో గుంతలమయమైన రోడ్లు పైన ప్రజలు, వాహనదారులు శనివారం అడుగడుగునా ఇబ్బందులు పడ్డారు.

 వర్షం

వర్షం

ఉదయం ఎనిమిది గంటల నుంచే ఆకాశం మేఘావృతమై ఓ మోస్తరు వర్షం కురవటంతో నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ చౌరస్తా, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.

 వర్షం

వర్షం

అత్యధికంగా 19.8 మిల్లీ మీటర్ల వర్షపాతం తిరుమలగిరిలో నమోదు కాగా, అత్యల్పంగా పాతబస్తీలో నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురవకపోయినా వాతావరణం చల్లబడి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది.

వర్షం

వర్షం

హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఓ మోస్త్తరు జల్లులు కూడా కురవటంతో నిత్యం రద్ధీగా ఉండే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కురిసిన చిరుజల్లులకు లక్డీకాపూల్ నుంచి అటు సంత్ నిరంకారి భవన్ వైపు, ఇటు మాసాబ్‌ట్యాంక్‌వైపు, సచివాలయం ముందు భారీగా ట్రాఫిక్ నిల్చిపోయింది.

 వర్షం

వర్షం

కొద్దిరోజుల క్రితం జరిగిన మెట్రోపాలిస్ వరల్డ్ కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సును పురస్కరించుకుని అధికారులు మెయిన్‌రోడ్లను రీ కార్పెటింగ్ చేసినా, కాలనీ రోడ్లు, సబ్ రోడ్లలో ఏర్పడిన గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.

వర్షం

వర్షం

పాతబస్తీలోని పలు ప్రాంతాలు, మెయిన్‌రోడ్లలో సకాలంలో చెత్తను తరలించకపోవటం, ఆపై శనివారం చిరుజల్లులు కురవటంతో చెత్త వర్షపు నీటిలో తడిసి ధుర్గంధాన్ని వెదజల్లుతోంది.

English summary
Photos of Telangana state capital Hyderabad city get rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X