మహిళ దారుణహత్య, లైంగిక దాడి! (ఫోటో)

హైదరాబాద్: ఓ మహిళ పైన లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన సంఘటన పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. కొత్తపేట గ్రామ పంచాయతీ, ఎర్రగుంట కాలనీలో నిర్జన ప్రదేశంలో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మహిళ ఒంటి పైన గాయాలతో పాటు రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహం పైన పడి ఉన్న తీరును బట్టి మహిళ పైన లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Photos: MURDER OF A LADY IN HYDERABAD

అయితే, ఆమె ఎడమ చేతి పైన పచ్చబొట్టుతో ముస్తఫా అనే పేరు మాత్రం ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఒంటిపై ఆరెంజ్‌ కలర్‌ సల్వార్‌, నల్లని బురఖా ఉంది. చేతిపై గోరింటాకుతో ముస్తఫా అనే పేరు అని రాసి ఉంది. మృతురాలి ముఖంపై గాయాలున్నాయని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మహిళపై సామూహిక అత్యాచారం

జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ పైన సామూహిక అత్యాచారం జరిగింది. గిరినగర్‌కు చెందిన 32 ఏల్ల మహిళ కూలీ పని చేసి జీవనం సాగిస్తోంది. శుక్రవారం సాయంత్రం చింతల్ కల్లు కంపౌండుకు వచ్చి కల్లు తాగింది.

అక్కడ ఇద్దరు యువకులు మాటలు కలిపి కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం వెనుకాల ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు. అప్పటికే అక్కడ ఉన్న మరో నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారు పారిపోయారు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+