పదో తరగతి విద్యార్ధినిపై లైంగిక వేధింపులు.. చేసిందెవరో తెలిస్తే షాక్ ?
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ జన్మనిచ్చిన వారి తర్వాత గురువుకే అంతటి గొప్ప స్థానాన్ని ఇస్తాం. పిల్లలు ఇంట్లో కంటే పాఠశాలలోనే ఉంటూ ఉపాధ్యాయులతో విద్యార్థులు తమ అనుబంధాన్ని పెంచుకుంటారు. కానీ విద్యా బుద్దులు నేర్పించి.. భావి పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులే.. కామంతో కళ్లు మూసుకుపోయి నీతిమాలిన పనులకు ఒడిగడుతున్నారు. టీచర్లు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు జరుగుతూనే ఉంటుండగా.. ఇప్పుడు తాజాగా నల్గొండ జిల్లాలో అలాంటి ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఘటన ఎలా జరిగింది?
నకిరేకల్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాలికపై ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీను మూడు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని కన్నీటి పర్యంతమై వివరించింది. నిన్న రాత్రి చెప్పిన ఈ ఘటనతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు ఉదయం నిందితుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించారు.

తల్లిదండ్రుల ఆగ్రహం..
నిందితుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఘర్షణకు దిగారు. స్థానికులు కూడా చేరడంతో ఉపాధ్యాయుడిని బహిరంగంగా చితకబాదారు. అనంతరం వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని కౌన్సెలింగ్ చేయించగా.. వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో పాఠశాల పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. "గురువు అంటే తండ్రిలాంటి వాడు. ఇలా జరిగితే పిల్లలను ఎవరికి నమ్మాలి?" అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications