మరోసారి తెర మీదకు కేటీఆర్,రకుల్ .. ఫొటోస్ వైరల్
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ , హీరోయిన్ రకుల్‌కు సంబంధించిన వివాదం ఎంతటి సంచనలం సృష్టించిందో తెలిసిన విషయమే. డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆ లిస్ట్‌లో హీరోయిన్ రకుల్ పేరు కూడా ఉంది. దీనిపై అప్పటి ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో కేటీఆర్‌కు సంబంధముందంటూ రేవంత్ రెడ్డి అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు.
I hate Dogs 😔 pic.twitter.com/6AWo9HldJ3
— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) August 25, 2024
డ్రగ్స్‌తో, రకుల్ ప్రీత్ సింగ్‌తో సంబంధం లేకుంటే కేటీఆర్.. కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయితే.. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు తన పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ కోర్టుకెక్కగా.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ కోర్టు రేవంత్ రెడ్డిని మందలించింది. నెమ్మదిగా ఈ వివాదం తెరమరుగయింది. అయితే తాజాగా రకుల్, కేటీఆర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేటీఆర్ ఓ కుక్క పిల్లతో ఫొటో దిగారు. అచ్చు గుద్దినట్టు సేమ్ కలర్‌లో ఉన్న కుక్క పిల్లతో హీరోయిన్ రకుల్ కూడా ఫొటోలు దిగింది.

వీరిద్దరు కుక్క పిల్లతో ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నిజమేనా అనే చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు.ఇదింతా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న తప్పుడు ప్రచారంగా బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నారు. ఒకే బ్రీడ్ కలిగిన కుక్క ఇద్దరి దగ్గర ఉండకూడదా అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడుకు ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఇరికించాలనే కుట్ర కనిపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఇక రకుల్ విషయానికి వస్తే..గతంలోనే ఈ ఆరోపణలను ఆమె కొట్టిపారేసింది. సమాజాంలో ఉన్నత స్థానంలో ఉన్న వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని రకుల్ గతంలో ఈ వివాదంపై స్పందించింది.












Click it and Unblock the Notifications