పోలీసు దెబ్బ: డబ్బుల గొడవలో ఆటో డ్రైవర్‌ను చంపేశాడు (పిక్చర్స్)
హైదరాబాద్: డబ్బుల విషయంలో పోలీసుతో జరిగిన గొడవ ఓ ఆటో డ్రైవర్ హత్యకు దారి తీసింది. తగాదాలో ఆవేశానికి లోనై కానిస్టేబుల్ ఆటో డ్రైవర్‌ను కొట్టాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆటో డ్రైవర్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు కానిస్టేబుల్‌ను చితకబాది, కాళ్లు చేతులు కట్టేసి స్థానిక పోలీసులకు అప్పగిం చారు.
ఈ సంఘటన హైదరాబాదులోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన కె.వినోద్ కుమార్ (37) సిర్పూర్ కాగజ్‌నగర్ పోలీ సు స్టేషన్‌లో కానిస్టేబుల్ (పిసి 1218)గా పనిచేస్తున్నాడు. ఎస్కార్ట్ డ్యూటీ వేయడంతో ఈనెల 3వ తేదీన ఓ రిమాండ్ ఖైదీని కోర్టు నుంచి ఆసీఫాబాద్ జైలుకు తీసుకెళ్లాడు.
అక్కడ జైలుకి రిమాండ్ ఖైదీని పంపించిన వినోద్‌కుమార్ తిరిగి పోలీసు స్టేషన్‌కు వెళ్ళకుండా హైదరాబాద్ లోని బోరబండలో ఉంటున్న తన అత్త గారింటికి వచ్చాడు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్న వినోద్‌కుమార్ తన భార్యను పంపించాల్సిందిగా గొడవపడ్డాడు. అయితే భార్యను పంపేదిలేదని వారు ఖరాకండిగా చెప్పడంతో మంగళవారం అర్ధరాత్రి అత్తగా రింటి నుంచి బయల్దేరిని వినోద్‌కుమార్ బోరబండ రహదారికి చేరుకున్నాడు.
అక్కడ సైదాబాద్ సింగరేణికాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వాదిత్యా సిరి నాయక్ ఆటోను ఎంగేజ్ చేసుకుని వినోద్ కుమార్ సికింద్రాబాద్‌కు బయల్దే రాడు. బుధవారం తెల్లవారు జామున సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీకి ఆను కుని ఉన్న గ్రీన్‌పార్క్‌కాలనీ వద్ద ఆటో డ్రైవర్, కానిస్టేబుల్ ఇద్దరు కూడా మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు.

ఘర్షణలో మరణించాడు
ఈ ఘర్షణలో కానిస్టేబుల్ వినోద్‌కుమార్ కొట్టిన దెబ్బకు ఆటోడ్రైవర్ వదిత్యా సిరి నాయక్ మృతి చెందాడు. విషయం గమనించిన స్థానికులు కానిస్టేబుల్ వినోద్‌కుమార్‌పై దాడి చేసి చితకబాదారు. అనంతరం కానిస్టేబుల్ కాళ్లు చేతులు కట్టేసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన ఆటో...
ఆదిలాబాద్ వెళ్లే నిమిత్తం కానిస్టేబుల్ వినోద్ కుమార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకు నేందుకు మంగళవారం అర్ధరాత్రి బోర బండలో నాయక్ ఆటో ఎక్కాడు. అయితే సికింద్రాబాద్ వెళ్లాల్సిన ఆటో సింగరేణి కాలనీ వద్ద ఎందుకు ప్రత్యక్ష మైందో అర్థం కావడం లేదు.

అటు ఎందుకు వచ్చాడు...
వినోద్‌కుమార్‌ను సికింద్రా బాద్‌కు తీసుకెళ్లాల్సిన ఆటో డ్రైవర్ నాయక్ తన ఇంటి వైపు ఎందుకు తీసుకువచ్చాడు. అసలు ఇద్దరి మధ్య ఘర్షణ ఎందుకు జరిగింది, వీరిద్దరు కలిసి ఎక్కడ మద్యం సేవించారు. తదితర వివరా లపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

డబ్బులు లాగేసుకున్నాడని...
సికింద్రా బాద్‌కు తీసుకెళ్లమంటే సింగరేణికాలనీకి తీసుకెళ్లి తన జేబులో ఉన్న డబ్బులను ఆటో డ్రైవర్ నాయక్ లాగేసుకున్నాడని, దీంతో తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా కోరానని, డబ్బులు ఇవ్వకపోవడంతోనే అతనిపై చేయి చేసుకున్నానని కానిస్టేబుల్ వినోద్‌కుమార్ దర్యాప్తు అధికారులకు వాగ్మూలం ఇచ్చాడు.

మత్తులోనే ఉన్నాడు...
కానిస్టేబుల్ బుధవారం రాత్రి వరకు కూడా ఇంకా మత్తులోనే ఉండడంతో విచారణ పూర్తి కాలేదని పోలీసులు చెప్పారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని దర్యాప్తు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications