రోహిత్ ఆత్మహత్య: విద్యార్థులతో రాహుల్ గాంధీ దీక్ష, ఆంతర్యం?

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో విద్యార్తులతో కలిసి కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ శనివారంనాడు దీక్షకు దిగారు. ఆయనతో పాటు లోకసభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా కూడా దీక్షలో కూర్చున్నారు.

రోహిత్‌ జయంతి సందర్భంగా 18 గంటలపాటు విద్యార్థులు శనివారంనాడు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. రాహుల్ గాంధీ రాకతో హెచ్ సీయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎబివిపి విద్యార్తులు హెచ్‌సియు గేట్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎబివిపి ఆందోళనకారులను పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. రాహుల్ గాంధీ హెచ్‌సియు అతి స్వల్వ వ్యవధిలో రెండు సార్లు రావడంలోని ఆంతర్యమేమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన శుక్రవారం రాత్రి హెచ్‌సియుకి వచ్చి దీక్షలో కూర్చున్నారు.

రాహుల్ గాంధీ ఇలా...

రాహుల్ గాంధీ ఇలా...

శుక్రవారం రాత్రి రాహుల్ గాంధీ విద్యార్థుల దీక్షా శిబిరంలో ఇలా కనిపించారు. రోహిత్ తల్లి రాధిక కూడా దీక్షలో ఉన్నారు.

రోహిత్ తల్లి ఇలా.,.

రోహిత్ తల్లి ఇలా.,.

విద్యార్థుల నిరాహార దీక్షా శిబిరంలో వేముల రోహిత్ తల్లి వేముల రాధిక ఇలా కనిపించారు.

కొవ్వొత్తుల ర్యాలీ..

కొవ్వొత్తుల ర్యాలీ..

రోహిత్ మృతి నేపథ్యంలో హెచ్‌సియులో శుక్రవారంనాడు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

కొవ్వొత్తుల ర్యాలీలో ఇలా...

కొవ్వొత్తుల ర్యాలీలో ఇలా...

వేముల రోహిత్ ఆత్మహత్యపై శుక్రవారంనాడు కూడా హెచ్‌సియు అట్టుడుకింది. విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కదం తొక్కిన విద్యార్థులు...

కదం తొక్కిన విద్యార్థులు...

రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని చెప్పారు.

ఇలా నిరసన...

ఇలా నిరసన...

శుక్రవారం రాత్రి విద్యార్థులు దీపాలు ముట్టించి, రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ఆందోళన కొనసాగించారు.

రోహిత్ పోస్టర్‌తో....

రోహిత్ పోస్టర్‌తో....

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇంకా ఆందోళనలతో అట్టుడుకుతోంది. శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలో ఇలా..

ర్యాలీలో రోహిత్ తల్లి ఇలా...

ర్యాలీలో రోహిత్ తల్లి ఇలా...

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో వేముల రోహిత్ తల్లి ఇలా కనిపించారు.

రోహిత్ తల్లితో రాహుల్

రోహిత్ తల్లితో రాహుల్

వేముల రోహిత్ తల్లి రాధికతో రాహుల్ గాంధీ ఇలా కనిపించారు. ఆయన శుక్రవారంనాడు విద్యార్థుల దీక్షలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+