దృష్టి మళ్లిస్తారు, చిటికెలో మాయం చేస్తారు: తమిళ రాంజీ ముఠా పట్టివేత (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న రాంజీనగర్ ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ నెల 19వ తేదీన అబిడ్స్, నారాయణగూడ, సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నాలుగు అటెన్షన్ డైవర్షన్ కేసులు నమోదయ్యాయి. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాల్లో ఈ ముఠాను అరెస్టు చేయడానికి కీలక ఆధారాలు లభించడంతో వెంటనే పోలీసులు ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్టు చేశారు.
డీసీపీ కమలాసన్‌రెడ్డి అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన రాంజీనగర్ ముఠాది దృష్టి మరల్చి దొంగతనాలు చేయడంలో అందె వేసిన చేయి. ఈ ప్రాంతంలోని పలువురు ముఠాగా ఏర్పడి దేశంలోని ప్రధాన నగరాల్లో దొంగతనాలు చేస్తున్నారు. బ్యాంకులు, షాపింగ్ కాంప్లెక్స్ వద్ద డబ్బు, నగలతో వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని వారి దృష్టి మరల్చి చోరీలు చేస్తుంటారు.
ఇలా హైదరాబాద్, ముంబయి, అహ్మదాబాద్, పూణే వంటి నగరాలలో ఈ దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బ్యాంకులు, షాపింగ్ మాల్స్ వద్ద కార్లలో వెళ్లే వారి పక్కనే రూ. 10 నోట్లను పడేస్తారు. డోర్‌ను కొట్టి డ్రైవర్‌కు సైగలతో మీ డబ్బులు పడిపోయాయని చెబుతారు. ఆ డబ్బులు తనవేనని చూసుకునే లోపే మరో డోర్ నుంచి అందులో ఉన్న సూట్‌కేస్, బ్యాగ్‌లను తీసుకొని ఆటోలో పరారవుతారు.

సిసి కెమెరాలు పట్టిచ్చాయి.
హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో జరిగిన నాలుగు వరుస చోరీలతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను విశ్లేషించారు. అందులో దొంగలకు సంబంధించిన ఆనవాళ్లు లభించడంతో ముఠా చేతికి చిక్కింది.

అరెస్టయింది వీరే..
పోలీసులకు పట్టుబడిన ముఠా సభ్యులను శశికుమార్, లింగేశ్వర్, నందకుమార్, ఆనందన్, సాహుల్ అమీద్‌లుగా గుర్తించారు. వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, 7సెల్‌ఫోన్లు, రూ. 56 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మరో ఏడుగురు పరారీలో..
రాంజీనగర్ ముఠాలోని మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. వీరు నగరంలోకి రాకముందు పూణేలో మూడు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకుంది. దీంతో ఆ కేసుల చిక్కుముడి కూడా వీడినట్లయింది.

గ్యాంగ్‌లో ఇలా..
ఒక్కో గ్యాంగ్‌లలో 11 నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. డబ్బు, నగలను దొంగిలించిన వెంటనే కొందరు వాటిని తీసుకొని అక్కడి నుంచి ఆటోలో జారుకుంటారు.












Click it and Unblock the Notifications