ఈ బంధమేనాటిదో: కెసిఆర్, రిచర్డ్ భేటీ (పిక్చర్స్)

హైదరాబాద్: అమెరికాతో తెలంగాణకు, హైదరాబాద్‌కు ఎంతో అనుబంధంవుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. భవిష్యత్తులో ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ భేటి అయ్యారు.

అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. అనేక సంస్థల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారని అన్నారు. చాలా మంది అక్కడే స్థిరపడ్డారని కూడా సీఎం కేసీఆర్‌ అన్నారు. అమెరికాకు తెలంగాణ పౌరులు నిత్యం రాకపోకలు సాగిస్తూనే వున్నారని అన్నారు.

దీనిరి రిచర్డ్‌వర్మ బదులిస్తూ అనేక రంగాలలో తెలంగాణకు అమెరికాకు సంబంధాలు వున్నాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుని కోసం తయారు చే సే హెలికాప్టర్‌ విడి భాగాలు కూడా హైదరాబాద్‌లోనే తయారయ్యే విషయాన్ని రిచర్డ్‌వర్మ గుర్తు చేశారు. గచ్చిబౌలి లో కొత్తగా నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్‌ కార్యాలయ పురోగతి గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు.

హైదరాబాద్‌కు ప్రాధాన్యం

హైదరాబాద్‌కు ప్రాధాన్యం

దేశంలో నాలుగు అమెరికా కాన్సులేట్‌ కా ర్యాలయాలు వుంటే అందులో ఒకటి హైదరాబాద్‌లో వుండడాన్ని బట్టి తమ దేశం తెలం గాణకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థం అవుతుందని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు.

అమెరికా దృష్టి పెట్టింది

అమెరికా దృష్టి పెట్టింది

తమ దేశానికి చెందిన చాలా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని రిచర్డ్ వర్మ అన్నారు. పరిశ్రమలు కూడా స్థాపిస్తున్నాయని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాలపై దృష్టి పెట్టిందని రిచర్డ్ అన్నారు. వీ టికి అమెరికా ప్రభుత్వం అమెరి కా కంపెనీలు నిశితంగా గమనిస్తున్నాయని వర్మ చెప్పారు.

నేను కూడా..

నేను కూడా..

తాను కూడా చాలా మంది అధికార, అనధికార ప్రముఖులు, సంస్థలతో సమావేశమయ్యా నని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల ను అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చ జరుగుతుందని రిచర్డ్ చెప్పారు. చాలా కార్యక్రమాలు వినూత్నంగా అభివృద్ధి సాధించే దిశగా వున్నాయని అభినందించారు.

సుదీర్ఘ చర్చ

సుదీర్ఘ చర్చ

వివిధ అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలపై వర్మ ముఖ్యమంత్రితో సుధీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంపై అందరి దృషి వుందని రిచర్డ్ అన్నారు. పారిశ్రామికంగా హైదరాబాద్‌కు వున్న ప్రత్యేకతపై ఆరా తీశారు. దీనికి సీఎం కే సీఆర్‌ స్పందిస్తూ దేశంలోనే పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన ప్రాంతం హైదరాబాదని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ పరిశ్రమలు వున్నాయని చెప్పారు.

అబ్దుల్ కలాం కూడా..

అబ్దుల్ కలాం కూడా..

1960 నుంచే రక్షణ పరిశ్రమ ఉత్పత్తులకు హైదరాబాద్‌ కేంద్రంగా వుందని కెసిఆర్ చెప్పారు. మిషన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇ ండియాగా పిలువబడే అబ్దుల్‌ కలాం కూడా హైదరాబాద్‌లోనే పరిశోధనలు చేశారని చెప్పారు. పరిశ్రమలకు హైదరాబాద్‌ సుస్థిర కేంద్రం కావడానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కెసిఆర్ అన్నారు.

సింగిల్ విండో విధానం

సింగిల్ విండో విధానం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్‌విండో విధానం, టిఎస్‌ ఐ నపాస్‌ చట్టం, విధివిధానాలను ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణలో విద్యుత్‌ అందుబాటు గురించి కూడా వర్మ వివరాలు అడిగారు. ప్రస్తుతం కొంతమేరకు లోటు వుందని ఈ ఏడాది చివరి నాటికి తక్షణ అవసరాలు తీరేం త విద్యుత్‌ను సమ కూర్చుకుంటున్నట్లు చెప్పారు. రెండు, మూడేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా మారుతుందని చెప్పారు.

నీతి ఆయోగ్ ద్వారా...

నీతి ఆయోగ్ ద్వారా...

ప్రణాళి క సంఘం స్థానంలో వచ్చిన నీతి అయోగ్‌ ద్వారా రాష్ట్రాలకు భాగస్వామ్యం పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తు న్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుప రుస్తున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+