సాగర్ ప్రక్షాళన: ట్యాంక్ బండ్ క్లోజ్ (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాణళనకు చర్యలను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. నాలుగు తూముల నుంచి ఇప్పటికే ప్రతిరోజు 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా హోటల్ మారియట్, జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద గల తూము నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు.

హుస్సేన్ సాగర్ నుంచి వ్యర్థ రసాయనాలతో కూడిన నీరు వస్తోందనే భయాందోళనలు వ్యక్తమవుతుండటంతో ఆ నీటిని దారి మళ్లించేందుకు జల మండలి సుమారు రూ.59 కోట్లతో పనులు చేపడుతోంది.అప్పర్ ట్యాంక్‌బండ్‌పై శుక్రవారం నుంచి ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులను మరింత వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను మళ్లించాలని జలమండలితో పాటు జిహెచ్‌ఎంసి, నీటి పారుదల శాఖ, బుద్దపూర్ణిమ ప్రాజెక్ట్ అధికారులు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో రాకపోకలపై ఆంక్షలు విధించామని, ఈ ఆంక్షలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు.

ట్రాఫిక్ మళ్లింపు..

ట్రాఫిక్ మళ్లింపు..

అప్పర్‌ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్‌వైపు మళ్లించారు. అదే విధంగా అప్పర్ ట్యాంక్ మీదకు వెళ్లే వాహనాలను కవాడిగూడ నుంచే మళ్లిస్తున్నారు. సికింద్రామాద్ ఆర్పీ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను కర్బాలా మైదానం మీదుగా బైబిల్ హౌజ్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తున్నారు.

ఈ ట్రాఫిక్ ఇటు వైపు..

ఈ ట్రాఫిక్ ఇటు వైపు..

తెలుగు తల్లి విగ్రహాం వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్, రోటరీ, పివి.ఘాట్, నల్లగుట్ట, కర్బాలా మైదానం, రాణిగంజ్ వరకు మళ్లిస్తున్నారు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహంతో పాటు సెయిలింగ్ క్లబ్‌వైపు ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించలేదు.

జిల్లాల నుంచి వచ్చే వాహనాలు..

జిల్లాల నుంచి వచ్చే వాహనాలు..

జిల్లాల నుంచి వచ్చే వాహనాలను జూబ్లీబస్ స్టేషన్ మీదుగా, ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ఆర్టీసి బస్సులు, భారీ వాహనాలను వైఎంసిఏ జంక్షన్, సంగీత్, తార్నాక, ఓయూ, మహాత్మగాంధీ బస్టాండు మీదుగా దారి మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ వాహనాలు అటు వైపుగా..

ఈ వాహనాలు అటు వైపుగా..

కట్టమైసమ్మ, చిల్డ్రన్ పార్కు నుంచి వచ్చే వాహనాలను ‘వార్త' దినపత్రిక కార్యాలయం లేను మీదుగా ఇందిరా పార్కు వైపు మళ్లిస్తారు. డిబిఆర్ మిల్లు వైపు నుంచి ‘వార్త' దినపత్రిక లేన్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదని పోలీసు కమిషనర్ చెప్పారు. లిబర్టీ, అంబేద్కర్ విగ్రహాం మీదుగా వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ మీదికి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

పనులు వేగవంతం..

పనులు వేగవంతం..

హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళన చేసి, దానికి పూర్వ వైభవం తెచ్చే చర్యల్లో భాగంగా పనులను వేగవంతం చేశారు. ఎండాకాలం ముగిసే లోగా దాన్ని ప్రక్షాళణ చేయాల్సి ఉంటుంది.

ఇలా మూసేశారు..

ఇలా మూసేశారు..

హుస్సేన్ సాగర్ జలాశయాన్ని శుద్ధి చేసే పనులు చేపట్టడంతో ట్యాంక్ బండ్‌పైకి వాహనాలను అనుమతించడం లేదు. దానికి వెళ్లే దారిని మూసేశారు.

ఒకప్పటి మంచినీళ్ల చెరువు..

ఒకప్పటి మంచినీళ్ల చెరువు..

హుస్సేన్ సాగర్ జలశయాన్ని నగరానికి మంచినీరు అందించడానికి నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించారు. అయితే, రసాయనాలతో, చెత్తతో అది పూర్తిగా కలుషితమై పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+