ఖైరతాబాద్ వినాయకుడి వద్ద వెంకయ్య సందడి (పిక్చర్స్)

ఖైరతాబాద్: త్రిశక్తి మయమోక్ష గణపతిగా భక్తులను అలరింపజేస్తున్న హైదరాబాదులోని ఖైరతాబాద్ మహాగణేశుడికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, విమలా దంపతులు గురువారం ఉదయం 9.45గంటలు తొలి పూజ నిర్వహించారు. విఘ్నేశ్వరుడు ప్రజల కష్టాలను తీర్చి, సుఖశాంతులను ప్రసాదించాలని కోరారు.

శుక్రవారంనాడు సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి త్రిశక్తిమయమోక్షగణపతిని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. దైవ చింతన అంటే కొబ్బరికాయలు, దీపారాధన కాదని, ప్రజల్లో అధ్యాత్మిక, భక్తిభావం జీవనవిధానంలో భాగం కావాలని వెంకయ్య అన్నారు.

నగరంలోని పద్మశాలి సంఘం రూపొందించిన 75 అడుగుల భారీ కండువా, జంజాన్ని స్వామి వారికి అలంకరించారు. అంబికా దర్బార్ ప్రత్యేకంగా రూపొందించిన 30 అడుగుల అగరుబత్తి ప్రత్యేకాకర్షణగా నిలిచింది.

అది మాత్రమే కాదు

అది మాత్రమే కాదు

కొబ్బరి కాయ కొట్టం, దీపారాధాన మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవనంలో చక్కని సంప్రదాయం ఉండాలని వెంకయ్య నాయుడు అన్నారు.

సామాజిక జీవనం మారుతుంది..

సామాజిక జీవనం మారుతుంది..

చక్కని సంప్రదాయం వల్ల సామాజిక జీవనం మారుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.

రెండు రాష్ట్రాల్లోనూ...

రెండు రాష్ట్రాల్లోనూ...

రెండు రాష్ట్రాల్లోనూ సమృద్ధిగా వర్షాలు పడి పాడిపండలు వృద్ధి చెందాలని తాను ప్రార్థించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు.

ప్రజలు సుఖసంతోషాలతో..

ప్రజలు సుఖసంతోషాలతో..

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వెంకయ్య నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

సత్కారం

సత్కారం

కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడిని కమిటీ నిర్వాహకులు సత్కరించారు. ఉత్సవ నిర్వాహకుడిగా సుదర్శన్ వ్యవహరిస్తున్నారు.

ఖైరతాబాద్ వినాయకుడి వద్ద..

ఖైరతాబాద్ వినాయకుడి వద్ద..

కేంద్ర మంత్రి ఎం, వెంకయ్య నాయుడు శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+