వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగత్ విజయంపై హర్శం వ్యక్తం చేస్తున్న గులాబీ నేతలు.!తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గులాబీ శ్రేణుల్లో మరోసారి పండుగ వాతావరణం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ కు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి మీద సంచలన విజయం నమోదు చేయడంతో పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ప్రజాధరణ తగ్గలేదు అనడానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపే ఉదాహరణ అని గులాబీ నేతలు చెప్పుకొస్తున్నారు.

 నాగార్జున సాగ‌ర్ గెలుపు స‌ర్కార్ ప‌నితీరుకు నిద‌ర్శ‌నం.. తెలంగాణ లో టీఆర్ఎస్ కు తిరుగులేదన్న నేతలు..

నాగార్జున సాగ‌ర్ గెలుపు స‌ర్కార్ ప‌నితీరుకు నిద‌ర్శ‌నం.. తెలంగాణ లో టీఆర్ఎస్ కు తిరుగులేదన్న నేతలు..

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదని, ఏ ఎన్నిక వచ్చినా కారు జోరు కొనసాగుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ అన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు పట్టం కట్టారని పేర్కొన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు నేతృత్వంలో, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయాన్ని అందించిన నాగార్జున సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

 రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదు.. కేంద్రం నుండి వచ్చే రాయితీలపై బీజేపి దృష్టిపెట్టాలన్న గులాబీ నేతలు..

రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదు.. కేంద్రం నుండి వచ్చే రాయితీలపై బీజేపి దృష్టిపెట్టాలన్న గులాబీ నేతలు..

తెలంగాణలో బీజేపీకి చోటు లేదని, టీఆర్ఎస్ కు బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు.
రెండు జాతీయ పార్టీలకూ నాగార్జున సాగర్ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. గత ఏడేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ఉనికే లేదన్నారు. ఇటీవల రెండు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో, తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెంటే ఉందని స్పష్టమయిందని తెలిపారు. ఈ ఎన్నికల సరళిని విశ్లేషిస్తే కాంగ్రెస్, బీజేపీలు టీఅర్ఎస్ కు అసలు పోటీ కావని తేటతెల్లం అయిందని నిరంజన్ రెడ్డి తెలిపారు.

 రెండు జాతీయ పార్టీలకు సాగర్ ప్రజలు బుద్ధి చెప్పారు.. భగత్ కు అభినందనల వెల్లువ..

రెండు జాతీయ పార్టీలకు సాగర్ ప్రజలు బుద్ధి చెప్పారు.. భగత్ కు అభినందనల వెల్లువ..

ఇక అనూహ్యమైనా విజాయాన్ని అందించినందుకు, తమపై విశ్వాసం ఉంచినందుకు సాగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.
ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని మరోసారి ఆయన స్పష్టం చేసారు. సాగర్ ఫలితాలు చూసైనా బీజేపి నేతలు బుద్ది తెచ్చుకోవాలని సుమన్ బీజేపి నేతలకు చురకలంటించారు. ముఖ్యమంత్రి పైన, మంత్రులపైన ప్రజా ప్రతినిధులపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మరని,
ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రం నుండి రావాల్సిన రాయితీల కోసం పోరాడాలని సూచించారు. ప్రస్తుత కరోన క్లిష్ట సమయంలో వాక్సిన్ లు, రిమిడిసివర్ ఇంజుక్షన్ లు తేవడం లాంటివి చేయాలని హితవు పలికారు.

 తెలంగాణ భవన్ లో సంబురాలు.. పాల్గొన్న మంత్రులు, నాయకులు..

తెలంగాణ భవన్ లో సంబురాలు.. పాల్గొన్న మంత్రులు, నాయకులు..

నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఘ‌న‌విజ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావు సంక్షేమ, అభివ్రుద్ది కార్యక్రమాలకు ఈ ఎన్నిక‌ల ద్వారా ప్ర‌జ‌లు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ‌జేశార‌ని, ప్ర‌భుత్వానికి మ‌రింత ప్రోత్సాహం ఇచ్చార‌ని తెలిపారు. అధికారం కోసం అడ్డ‌గోలు కూత‌లు కూసే జాతీయ పార్టీల‌కు తెలంగాణ ప్ర‌జ‌లు క‌ర్రు కాల్చి వాత‌పెట్టార‌ని, వాపును చూసి బ‌లుప‌ని విర్ర‌వీగిన బీజేపీకి తెలంగాణ ప్ర‌జ‌లు స‌రైన గుణ‌పాఠం చెప్పార‌న్నారు. ఎన్నో ప‌ర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌నిచేసిన జానారెడ్డి నాగార్జున‌సాగ‌ర్ లో చేసిన అభివ్రుద్ది ఏమిలేద‌ు కాబట్టే ప్ర‌జా తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని చెప్పారు. ఈ విజ‌యానికి క్రుషి చేసిన ప్ర‌తీ టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌కు, నేత‌ల‌కు, అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కు మంత్రి కమలాకర్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు

Recommended Video

Telangana Municipal Elections : కరోనా నిబంధనలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్...!!

English summary
The festive atmosphere once again took place in the trs cadre.TRS candidate Nomula Bhagat in Nagarjuna Sagar by-election With the sensational victory over Congress candidate Janareddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X