వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ వ‌ల్ల గులాబీ విక‌సిస్తుందా..! వాడిపోతుందా..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: తెలంగాణ లో ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు వార‌సుడి గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఎవ‌రు ప‌గ్గాలు చేప‌డ‌తార‌న్న ప్ర‌శ్న‌కు ట‌క్కుమ‌ని కేటీఆర్ పేరు చెప్తున్నారు తెలంగాణ ప్ర‌జ‌లు. అది నిన‌న్న‌టి వ‌ర‌కు.. కాని ఇప్పుడు ప‌రిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవ‌డంతో పాటు కేటీఆర్ స్వ‌యంక్రుతాప‌రాధంగా చేసిన కొన్ని పొర‌పాట్లు ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని మ‌స‌క‌బారేట్టు చేసాయి. కేటీఆర్ భావిత‌రాల నాయ‌కుడు కాగ‌ల‌డా అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతున్న‌ప్పుడు తెలంగాణ ప్ర‌జ‌లు పెద‌వి విరిచే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

కేటీఆర్ తెలంగాణ‌కు సీయం కాగ‌ల‌డా..? ఏమో అంటున్న ప్ర‌జ‌లు..!!

కేటీఆర్ తెలంగాణ‌కు సీయం కాగ‌ల‌డా..? ఏమో అంటున్న ప్ర‌జ‌లు..!!

కే. చంద్ర‌శేఖ‌ర్ రావు ఉద్య‌మ నేత‌..! తెలంగాణ తొలి సీఎం. మ‌రి ఆయ‌న త‌న‌యుడు ఐటీ మంత్రి, తండ్రికి త‌గిన త‌న‌యుడిగా మాట‌తీరులోనే కాకుండా వ్వ‌వ‌హార‌శైలిలో కేటీఆర్ జ‌నం నుంచి మంచి మార్కులు కొట్టేశారు. గులాబీ పార్టీకి ఆయ‌న బలం. భ‌విష్య‌త్ నాయ‌కుడుగా తెలంగాణ ప్ర‌జానికం అభివ‌ర్ణిస్తున్నారు. కేటీఆర్ కూడా పార్టీతో పాటు, ఐటీ శాఖ‌, పుర‌పాల‌క శాఖ‌పై ప‌ట్టు సాధించారు. దాంతోపాటే అవినీతి ఆరోప‌ణ‌లు కూడా మూట‌గ‌ట్టుకున్నారు. ప్లే బాయ్ క్ల‌బ్‌కు అనుమ‌తి ఇప్పించ‌టం ద్వారా భారీగానే ముడుపులు అందుకున్నారంటూ మూడేళ్ల క్రితం పుకార్లు వ‌చ్చాయి. ఆ త‌రువాత బ‌దిలీలు, పోస్టింగ్స్‌, కాంట్రాక్టులు, సీట్ల కేటాయింపులో దండిగానే దండుకున్నట్టు ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

హ‌రీష్ కి ప్రాధాన్యత త‌గ్గించ‌డంలో కేటీఆర్ పాత్ర‌..! ఔనంటున్న గులాబీ శ్రేణులు..!!

హ‌రీష్ కి ప్రాధాన్యత త‌గ్గించ‌డంలో కేటీఆర్ పాత్ర‌..! ఔనంటున్న గులాబీ శ్రేణులు..!!

అంతే కాదు త‌న మాటే చెల్లుబాటు కావాల‌నే ఉద్దేశంతో హ‌రీష్‌రావును సైడ్‌ట్రాక్ చేయించాడ‌టం వెన‌క కేటీఆర్ కీల‌క పాత్ర ఉన్న‌ట్టు తెలుస్తెఓంది. రాష్ట్రంలో త‌న మాటే చెల్లుబాటు కావాల‌నే ఉద్దేశంతో మంత్రుల‌ను కేవ‌లం డ‌మ్మీలుగా మార్చి చ‌క్రం తిప్పాడ‌నే ఆరోప‌ణ‌లు కూడా లేక‌పోలేదు. సీనియ‌ర్ మంత్రులు సైతం, కేటీఆర్ చెబితే ఓకే అనేంత‌గా మారారు. వ‌రంగలో బ‌ల‌మైన వ‌ర్గం.. కేడర్ ఉన్న కొండాసురేఖ‌, ముర‌ళీ దంప‌తులు తాము పార్టీ వీడ‌టాన‌కి.. కేటీఆర్ కార‌ణ‌మంటూ దుమ్మెత్తిపోశారు. పైగా కేటీఆర్ వ‌ల్ల‌నే గులాబీ గూటికి చెడుదాపురించిందంటూ తేల్చిచెప్పారు.

కేసీఆర్ ఓకే...!! కానీ కేటీఆర్ ప్ర‌మాదక‌రం అంటున్న నాయ‌కులు..!!

కేసీఆర్ ఓకే...!! కానీ కేటీఆర్ ప్ర‌మాదక‌రం అంటున్న నాయ‌కులు..!!

ఇటీవ‌ల పార్టీ వీడుతున్న చాలామంది నాయ‌కులు కేసీఆర్ ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడు కానీ ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ మాయ‌లో ప‌డిపోయి పార్టీని నాశ‌నం చేస్తున్నారంటూ వాపోయారు. తాజాగా, కేటీఆర్ నోటిదురుసు పెరిగింది. పాత్రికేయ మిత్రులు, అధికారులు, పార్టీ నేత‌ల‌తోనూ చాలా దురుసుగా మాట్లాడుతున్న‌ట్లు స‌మాచారం. కొంద‌రు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను కూడా ఏక‌వ‌చ‌నంతో సంబోధించ‌టం, బూతు పురాణంతో మాట్లాడే విష‌య‌మై అదికారుల సంఘం విప‌క్ష నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క‌ను క‌ల‌సి గోడు వెళ్ల‌బోసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

కేటీఆర్ పై ఆరోప‌ణలు..!బ‌య‌ట‌ప‌డాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచితీరాలి..!!

కేటీఆర్ పై ఆరోప‌ణలు..!బ‌య‌ట‌ప‌డాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచితీరాలి..!!

పార్టీను గ‌ట్టెక్కించాల్సిన కేటీఆర్‌, పార్టీని న‌ట్టేట్లో ముంచ‌టం ఖాయ‌మంటూ గులాబీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నాయి. మ‌రి ఇదంతా అపోహ‌లు మాత్ర‌మే, తాను నిప్పు అంటూ కేటీఆర్ నిరూపించుకోవాలంటే, గులాబీ పార్టీ 100 సీట్లకు త‌క్కువ కాకుండా గెల‌వాలి. లేదా, కేసీఆర్ ఏదో విధంగా మ‌ళ్లీ అధికారంలోకి రావాలి. ఈ రెండూ జ‌ర‌గ‌క‌పోతే, కేటీఆర్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌న్నీ నిజ‌మ‌నే భావ‌న టీఆర్ ఎస్‌లోనే కాదు, తెలంగాణ ప్ర‌జ‌ల్లోనూ బ‌ల‌ప‌డుతుంది. కేటీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను కూడా ఈ ఆరోప‌ణ‌లు ప్ర‌శ్నార్ధ‌కం చేయ‌నున్నాయి.

English summary
There is a lot of discussion about the successor of the Chief Minister Chandrashekhar Rao in Telangana.The name of KTR is mentioned by the people of Telangana who will question who will be the Chief Minister of Telangana after KCR.The question of whether KTR could be the leader of the masses is that the people of Telangana are lip-clad conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X