వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ రైతు వ్యతిరేకి, చేతకాక.. కేంద్రంపై తప్పుడు విమర్శలు: పీయూష్ గోయల్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి రా రైస్ సేకరిస్తామని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విధానాన్నే తెలంగాణలోనూ కొనసాగిస్తున్నట్లుతెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు.

కేంద్రంపై కేసీఆర్ సర్కారు తప్పుడు ప్రచారం: పీయూష్ గోయల్

కేంద్రంపై కేసీఆర్ సర్కారు తప్పుడు ప్రచారం: పీయూష్ గోయల్

కేసీఆర్ ప్రభుత్వం కావాలనే కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తోందని, ధాన్యం సేకరణలో రాష్ట్రం విఫలమైందని విమర్శలు గుప్పించారు పీయూష్ గోయల్. ముడి బియ్యం ఇస్తామని అన్నీ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పట్ల వివక్ష చూపడం లేదని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో కొంతమంది నేతలు కేంద్రంపై కారణంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ నేతలనుద్దేశించి విమర్శించారు. రైతుల విషయంలో సానుకూలంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుందని... ఇందులో ఎలాంటి వివక్ష ఉండదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

కేసీఆర్ రైతు వ్యతిరేకి.. సమాధానమివ్వడం లేదంటూ కేంద్రమంత్రి ఫైర్

కేసీఆర్ రైతు వ్యతిరేకి.. సమాధానమివ్వడం లేదంటూ కేంద్రమంత్రి ఫైర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చిన విధంగా వ్యవహరించాలని సూచించారు. రా రైస్ కొన్ని రాష్ట్రాలు ఇచ్చాయని, ఈ విషయంలో సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ సర్కార్ కు సూచించడం జరిగిందన్నారు.
ఫిబ్ర‌వ‌రి 25న అన్ని రాష్ట్రాల‌ను పిలిచి, ఎవ‌రెంత ఇస్తారో అడిగినట్లు, అలాగే రా రైస్ ఎంతిస్తారనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే....ఇప్పటి వరకు ఎంత ధాన్యం (రా రైస్) ఇస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు కేంద్రమంత్రి. ఆ తర్వాత మరో సమావేశం ఏర్పాటు చేయడం అప్పుడు కూడా ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు సమాచారం ఇచ్చినా.. తామెంత ముడిబియ్యం ఇస్తామో తెలంగాణ చెప్ప‌లేదన్నారు. కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులను మభ్య పెడుతోందని తమకు అర్థమౌతోందన్నారు. మంత్రులు ఎలాంటి విజ్ఞప్తులు చేశారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు.

కేసీఆర్ చేతకానితనాన్ని కేంద్రంపై రుద్దుతున్నారంటూ పీయూష్ గోయల్

కేసీఆర్ చేతకానితనాన్ని కేంద్రంపై రుద్దుతున్నారంటూ పీయూష్ గోయల్

అన్ని రాష్ట్రాలు ఎఫ్‌సీఐలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. కేసీఆర్ చేతకానితనాన్ని కేంద్రంపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో కంటే ఏడున్న రెట్లు తెలంగాణ నుంచి ధాన్యం సేకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని, ఏపీ కూడా 25ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ముడిబియ్యం ఇస్తోందన్నారు. స‌మాచారం ఇవ్వ‌కుండా రైతుల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని పీయూష్ గోయల్ మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉందని, ఎలాంటి వివ‌క్ష లేకుండా దేశ‌మంత‌టా బియ్యం సేక‌ర‌ణ చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. కాగా, గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను తెలంగాణ మంత్రులు, ఎంపీలు కలిశారు. తెలంగాణలో మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.

English summary
Piyush Goyal slams cm kcr for telangana rice procurement issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X