శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం
ఇటీవల విమాన ప్రమాదాలతో పాటు విమానాల్లో సాంకేతిక సమస్యలు అధికంగా జరుగుతున్నాయి. గతంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో భక్తులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ సాంకేతిక సమస్యల కారణంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఆ తర్వాత అనేక అనేక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన జరిగింది.
హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలట్. దీంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పైలట్ సకాలంలో సమస్యను గుర్తించడంతో విమానంలో ఉన్న 67 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా తిరుపతి వెళ్లాల్సి ఉంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం వాళ్లంతా గంటల కొద్దీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. పైలట్ చాకచక్యంతో విమానం సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ విజయవంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది మెకానికల్ సమస్యనా..? లేక ఎలక్ట్రికల్ లోపమా..? అనేది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటన సమయంలో విమానంలోని 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications