కేటీఆర్‌ను ప్రశంసిస్తూ ప్రధాని మోడీ లేఖ: ఎందుకంటే..?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారంటూ ప్రశంసించారు. ఈ మేరకు కేటీఆర్‌కు ప్రధాన మోడీ ఓ లేఖ రాఖ రాశారు.

మరికొన్ని రోజుల్లో మహాత్మాగాంధీ జయంతి రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న 'స్వచ్ఛత హి సేవా' ఉద్యమంలో పాల్గొనాలని కేటీఆర్‌ను ఆయన ఆహ్వానించారు.

PM Modi Appreciate Letter To Minister KTR on Mission Bhagiratha Scheme

తెలంగాణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని మోడీ అన్నారు. మన సరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందని ప్రధాని వివరించారు. పరిశుభ్రత లేకుంటే సమాజం బలహీనపడిపోతుందని అన్నారు.

కేటీఆర్ తన అనుభవాలను నరేంద్ర మోడీ యాప్‌లో పంచుకోవాలని ప్రధాని చెప్పారు. దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లి.. నూతన భారతాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇదే బాపూకు మనమిచ్చే నివాళి అని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PM Narendra Modi Appreciated Telangana minister KT Rama Rao through a Letter for Mission Bhagiratha Scheme and Swachh Bharat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X