డీకే అరుణకు ఓటేసి జవాబివ్వండి: మోడీ గ్యారంటీలు ఇవేనంటూ ప్రధాని

మహబూబ్‌నగర్: ఈ లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌​నగర్ ఎంపీ అభ్యర్థి డీకే ఆరుణకు మద్ధతుగా నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఇండియా కూటమి, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

'నా పాలమూరు సోదరసోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు. జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నా' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మోడీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే దేశ భద్రతకు గ్యారంటీ అని, మోడీ గ్యారంటీ అంటే విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే ఇచ్చిన హామీలు నెరవేరతాయనే గ్యారంటీ అని స్పష్టం చేశారు.

PM modi election campaign in narayanpet for supporting bjp mp candidate DK Aruna

గత పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ఆయన ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్‌ దోచుకుంటోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా బీఆర్ఎస్ దారిలోనే లూటీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలిచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కులాల పేరిట, మతాల పేరిట విభజించాలని చూస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. దేశం ఏమైపోయినా కాంగ్రెస్‌కు అవసరం లేదని, దానికి రాజకీయ లబ్ధి మాత్రమే కావాలని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఎన్నికలొస్తేనే తన ప్రేమ దుకాణం తెరుస్తారని ఎద్దేవా చేశారు.

మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే మత మార్పిడులు పెరుగుతాయన్నారు ప్రధాని మోడీ. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్‌కు తెలుసు. మతపరమైన రిజర్వేషన్లను అంబేద్కర్ కూడా తిరస్కరించారు.
అయినప్పటికీ కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా అని మోడీ ఆరోపించారు.

కాంగ్రెస్‌కు హిందువులపైగానీ, దేశంపైగానీ ప్రేమలేదన్నారు ప్రధాని మోడీ. వంచితుల కోసం మోడీ చౌకీదార్‌లా ఉంటారన్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణను గెలిపించాలని.. ఆమెకు వేసే ప్రతి ఓటు తనకే చెందుతుందన్నారు. డీకే అరుణపై స్వయంగా ముఖ్యమంత్రే దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఓటు ద్వారానే జవాబివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు ఇళ్లకు వెళ్లిన తర్వాత మీకు తెలిసినవారందరికీ మోడీ నమస్కారాలు తెలియజేశారని చెప్పండి అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+