4 తర్వాత వారంతా పారిపోతారు: ఎల్పీ స్టేడియంలో మోడీ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై విమర్శలు గుప్పించారు.
జూన్ 4 తర్వాత భారత విరోధులు పారిపోక తప్పదని ప్రధాని మోడీ హెచ్చరించారు. బీజపీని గెలిపించాలని 140 కోట్ల మంది ప్రజలు సంకల్పం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఎన్నోచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయని, దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలుడు జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడికెళ్లాలన్న భయపడాల్సిన పరిస్థితి ఉండేదని.. గత పదేళ్ల కాలంలో అలాంటి పరిస్థితిని చూశారా? అని మోడీ ప్రశ్నించారు.

తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని, ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని ప్రజలు నిశ్చయించుకున్నారని, బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తెలంగాణలో అక్షయ తృతీయ గొప్ప పండుగగా ఆయన అభివర్ణించారు.
జూన్ 4 తర్వాత భారత విరోధులు, ఉమ్మడి పౌరస్మృతి విరోధులు, ఆర్టికల్ 370 రద్దు వ్యతిరేకులు, ఓట్ జిహాద్ వాళ్లు పారిపోక తప్పదని ప్రధాని మోడీ హెచ్చరించారు. మధ్య తరగతి ప్రజల కలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని, గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు ఎన్డీఏ సర్కార్ పరిష్కారం చూపిందని ప్రధాని మోడీ తెలిపారు. నేడు భారత్ డిజిటల్ రంగం, ఇంటర్‌ప్రిన్యూర్ సంస్థల్లో సూపర్ పవర్‌గా నిలిచిందన్నారు ప్రధాని మోడీ.
లోక్ సభ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బిజెపి అభ్యర్థులు సికింద్రాబాద్ అభ్యర్థి శ్రీ @kishanreddybjp గారు, హైదరాబాద్ అభ్యర్థి శ్రీ మతి @Kompella_MLatha గారు, మల్కాజ్ గిరి అభ్యర్థి శ్రీ @Eatala_Rajender గారు, చేవెళ్ల అభ్యర్థి శ్రీ @KVishReddy గారు, భువనగిరి అభ్యర్థి శ్రీ… pic.twitter.com/P5XXhYcuIg
— BJP Telangana (@BJP4Telangana) May 10, 2024
వారసత్వ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ట్రాక్ రికార్డుగా ఉందని మోడీ విమర్శించారు. మధ్య తరగతి ప్రజల గురించి కాంగ్రెస్ ఏమాత్రం పట్టించుకోదని మోడీ మండిపడ్డారు. దేశాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాకుమారుడి గురువు మనల్ని ఆఫ్రికన్లు అని మాట్లాడారని, శ్రీ రామనవమి జరుపుకోవడం కూడా తప్పే అన్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అహింసో పరమో ధర్మో అనేది ఇండియా సిద్ధాంతమని, వసుధైక కుటుంబం, బుద్ధం శరణం, గచ్చామి, ప్రజా సేవే భగవాన్ సేవ, వేల సంవత్సరాల సంస్కృతి రక్షణే ఇండియా అసలైన సిద్ధాంతమని మోడీ వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ముక్తి దివస్‌ను నిర్వహించలేదని, బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించిందని మోడీ గుర్తు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం లను ప్రజలు వద్దంటున్నారు. బిజెపికి మాత్రమే తెలంగాణ ప్రజలు ఓటు వేస్తామంటున్నారు. - ప్రధాని శ్రీ @narendramodi గారు.#PhirEkBaarModiSarkar #ManaModiSarkar pic.twitter.com/mqX38SFYcV
— BJP Telangana (@BJP4Telangana) May 10, 2024
మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదనేది బీజేపీ సిద్ధాంతమని, రాజ్యాంగ వ్యతిరేకమైన ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని మాత్రమే బీజేపీ చెప్పిందన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులను ఏటీఎంగా మార్చుకున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ కూడా మొదలైందని, మూడో ఆర్ అంటే రజాకార్ ట్యాక్స్ మోడీ చెప్పారు.
తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్ అంటోందని ప్రధాని మండిపడ్డారు. తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు ఇచ్చింది ఎవరని మోడీ ప్రశ్నించారు. తెలంగాణకు తొలి ఎయిమ్స్, ఫర్టిలైజర్స్ పరిశ్రమ, పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసినట్లు ప్రధాని వివరించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ బీజేపీ నినాదమని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులైన మధవీ లత, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కిషన్ రెడ్డిలను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి?











Click it and Unblock the Notifications