Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ తెలంగాణ కళాకారుడి టాలెంట్‌కు ఆశ్చర్యపోయిన ప్రధాని మోదీ

రాజన్న సిరిసిల్ల: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ఆయన 95వ రేడియో ప్రసంగం. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ప్రస్తావించారు. జీ20 శిఖరాగ్ర సదస్సు, అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో శాస్త్రవేత్తలు సాధిస్తోన్న ప్రగతిని ప్రస్తావించారు. వారికి అభినందనలు తెలియజేశారు. విక్రమ్- ఎస్ రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతం చేయడం ద్వారా భారత్- అంతరిక్ష పరిశోధనల్లో కొత్త పుంతలు తొక్కినట్టయిందని పేర్కొన్నారు.

భారత్- భూటాన్ సంబంధాలపై..

అలాగే- పీఎస్ఎల్వీ సీ54 రాకెట్ ప్రయోగాన్ని కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఓషన్‌శాట్‌ను ద్వారా సముద్రాలపై మరింత లోతైన అధ్యయనం చేయగలుగుతామని పేర్కొన్నారు. వర్షాల గురించి పూర్తిస్థాయి డేటాను స్వీకరించవచ్చని, దీనివల్ల వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. భూటాన్ అభివృద్ధి చేసిన ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించిందని, రెండు దేశాల మధ్య బలమైన ఇది సంకేతమని వ్యాఖ్యానించారు.

జీ20కి ఆతిథ్యం..

జీ20కి ఆతిథ్యం..

దీనితో పాటు జీ20 శిఖరాగ్ర సదస్సు గురించి ప్రజలకు వివరించారు ప్రధాని మోదీ. జీ20ని నిర్వహించే అవకాశం భారత్‌కు దక్కిందని పేర్కొన్నారు. ప్రపంచానికి దిశా నిర్దేశం చేయగల తీర్మానాలను జీ20 సమ్మిట్‌లో ఆమోదం పొందుతాయని వివరించారు. ప్రపంచానికి మేలు చేసే అంశాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుందని మోదీ చెప్పారు. ప్రపంచ శాంతి, ఐక్యత, సుస్థిరాభివృద్ధి వంటి పురోగమన చర్యలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

థీమ్ ఇదే..

'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే థీమ్‌‌తో భారత్‌లో జీ20 సదస్సు జరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి 20 శక్తిమంతమైన దేశాలు పాల్గొనబోయే ఈ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ప్రతి పౌరుడికీ గర్వకారణమని స్పష్టం చేశారు. తాము ఎంతగా గర్వపడుతున్నామో తెలియజేస్తూ ప్రజలు తనకు లేఖలు రాశారని, దీనివల్ల అమృత్ కాల లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.

వెల్ది హరిప్రసాద్‌పై

ఈ సందర్భంగా- తెలంగాణ చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ పేరును ప్రత్యేకంగా తన ప్రసంగంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు ప్రధాని మోదీ. వెల్ది హరిప్రసాద్‌ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా. తనకు పంపించిన అద్భుత బహుమతిని చూసి ఆశ్చర్యపోయానని ప్రధాని అన్నారు. వెల్ది హరిప్రసాద్ తాను స్వయంగా నేసిన జీ20 లోగోను పంపించారని, అది అందరినీ ఆకర్షిస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదని మోదీ వ్యాఖ్యానించారు.

లేఖ కూడా..

లేఖ కూడా..

వచ్చే ఏడాది నిర్వహించబోయే జీ20 సమ్మిట్‌ను నిర్వహించడం భారత్‌కు ఎంతో గర్వకారణమంటూ హరి ప్రసాద్ తనకు లేఖ కూడా రాశారని చెప్పారు. జీ20కి భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ లోగోను తయారు చేశానని వివరించినట్లు పేర్కొన్నారు. దేశం నలుమూలలా ఎంతోమంది కళాకారులు ఉన్నారని, ఇక్కడ తయారైన సంగీత పరికరాలు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు కొనుగోలు చేస్తోన్నాయని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+