గుండెను పిండేసే దృశ్యాలు, స్పందించిన ప్రధాని - బాధితులకు పరిహారం..!!
చేవెళ్ల బస్సు ప్రమాద దృశ్యాలు పలు హృదయాలను కలిచివేస్తున్నాయి. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొని మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పరిహారం ప్రకటించింది. కాగా, ఈ బస్సు ప్రమాదం పైన ప్రధాని సంతాపం వ్యక్తం చేసారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఘటన సమయంలో ప్రయాణీకు ల ఆర్తనాదాలు చేయడం గుండెను పిండేసేవిగా ఉన్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసు పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నారని సమాచారం. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చని పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటిచింది. అలాగే ప్రమాద ఘటనపై విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— PMO India (@PMOIndia) November 3, 2025
మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2…
చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాల కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం.. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున సాయం ప్రకటించారు.
ఘటనా స్థలిని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ప్రమాదంపై రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదని.. బాధితుల కు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నా మని మంత్రి తెలిపారు. ప్రస్తుతం చేవెళ్ల ఆస్పత్రిలో 10 మందికి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకి తరలించినట్టు అధికారులు వెల్లడించారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications