నన్ను కాల్చి చంపండి, హైద్రాబాదీలకు అలవాటు: మోడీ ఉద్వేగం (పిక్చర్స్)

హైదరాబాద్: దళితులను అడ్డు పెట్టుకొని కుళ్లు రాజకీయాలు చేయవద్దని, తనతో యుద్ధం చేయాలని, కాల్చాలనుకుంటే తనను కాల్చాలని, దళిత సోదరులను కాదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఊగిపోయారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ మహాసమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

దళితులపై దాడులపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇంకా అంటరానితనం సిగ్గుచేటు అన్నారు. దళితులపై దాడులు అంటే అది మానవతకు తీరని మచ్చ అన్నారు. ఎవరైనా దళితలపై తూటాలను కాల్చాలనుకుంటే తొలుత తనపై ప్రయోగించాలని ఉద్వేగంతో అన్నారు.

గత ప్రభుత్వాలు దళితులకు చేసిన సేవ ఏమీ లేదని, వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఉపయోగించుకున్నాయని, ఇకపై అలాంటి పరిస్థితి రాదని, దళితులను గౌరవించుకుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

ఆదివారం సాయంత్రమిక్కడ ఎల్బీ స్టేడియంలో బీజేపీ మహా సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన ప్రసంగంలో దళితుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలు దళితులను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయని చెబుతూనే గడిచిన రెండేళ్లలో ఎన్డీయే హయాంలో దళిత సంక్షేమానికి ఏంచేశారో చెప్పారు.

బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూడురంగుల జాతీయ జెండాతో యాత్రలు చేపట్టాలని, దేశరక్షణకు ప్రాణాలర్పించిన, సేవలందిస్తున్న సైనికులకు, వారి కుటుంబాలను గౌరవించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

ఇప్పటికీ అంటరానితనం, అస్పృశ్యతల పేరిట దళితులను కొందరు ఈ సమాజానికి దూరం చేస్తున్నారని, కొందరు దళిత సోదరులపై కూడా రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటివారు ఏమైనా సమస్యలుంటే నాపై పోరాటం చేయాలని, దళితులపై కాదన్నారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

ఓట్లతో కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని, దళిత సమాజం వారి కబ్జాలో ఉందని, దళితుల అభివృద్ధి కోసం బీజేపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు, మంచి పనులు వారికి చేరకూడదని పన్నాగం పన్నుతున్నాయన్నారు.

బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

దళిత వర్గాలు బీజేపీ వైపు వెళ్తే మరో 50 ఏళ్లపాటు బీజేపీని అధికారం నుంచి పక్కకు జరపలేమని వారికి తెలుసునని, అందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

దళితులను గౌరవించుకుంటేనే దేశ అభివృద్ది సాధ్యమన్నారు. దేశమాత కోసం బలిదానమిచ్చిన వారిలో దళితులు ముందున్నారని, మనుషుల మధ్య బేధాలు ఉండకూడదన్నారు.

బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

దళితులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గౌరవించాలని, వారి అభివృద్ధికి అందరం కలిసికట్టుగా ప్రయత్నించాలని, రాంమనోహర్‌లోహియా, మహాత్మా గాంధీ వంటి వారు అంటరానితనంపై పోరాటాలు చేశారన్నారు.

బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

సమాజాన్ని కుల, మత, జాతి భేదాలతో విభజించారని, ఇది ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని, మనది వసుధైక కుటుంబం అన్నారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం



అంబేడ్కర్‌ ఆదర్శనీయుడని, పార్లమెంటులో ఆయన సేవలపై మేం రెండురోజుల పాటు ప్రత్యేక చర్చ పెట్టామని, అమెరికా, బ్రిటన్‌ పార్లమెంటుల్లో నేను ప్రసంగించే సమయంలో వివేకానంద, గాంధీ, అంబేడ్కర్‌ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించానని చెప్పారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

డెబ్బై ఏళ్లపాటు దేశాన్ని పాలించిన వారు అంబేడ్కర్‌ వంటి మహాపురుషుణ్ని ప్రపంచం ముందు పెట్టలేకపోయారని, బ్రిటన్‌లో అంబేడ్కర్‌ నివసించిన ఇంటిని కొనుగోలు చేసి స్మారకభవనంగా మార్చామన్నారు. ఆయన స్మృతులను గుర్తుచేసుకునే ప్రతీదాన్ని పదిలపరిచామన్నారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

దేశంలో దళిత పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇస్తున్నామని, ఇప్పటి వరకు మూడువేల మందిని గుర్తించామని, వారికి ప్రోత్సాహం ఇస్తున్నామని ప్రధాని చెప్పారు.

బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

ఈ బీజేపీ మహా సమ్మేళనం సభా వేదిక నుంచి చూస్తుంటే తనకు భవిష్యత్‌ తెలంగాణ దర్శనమిస్తోందని, తెలంగాణలో బీజేపీ నూతనాధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా కనబడుతోందని ప్రధాని అన్నారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

2013లో నేను ఇక్కడికే వచ్చానని, అప్పుడు తన సమావేశానికి వచ్చేవారికి టికెటు ఉంటుందని ప్రకటించారని, భారత రాజకీయాల్లో ఇలాంటి సంప్రదాయం ఇక్కడి నుంచే ప్రారంభమైందన్నారు. తెలంగాణ ప్రజలు చరిత్ర తిరగరాశారని, ఆనాడు నేను కనీసం ప్రధానమంత్రి అభ్యర్థిని కూడా కాదన్నారు.

బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

దేశ రాజకీయాలను కొత్తగా చూడడం హైదరాబాద్‌ ప్రజలకు అలవాటేనని, ఇప్పుడు ఈ రోజు మరో చరిత్రకు తెలంగాణ వేదికైందన్నారు.

బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

వేలాదిమంది బూత్‌స్థాయి కార్యకర్తలు ఇక్కడికి వచ్చారని, ఇది బీజేపీ సంఘటిత శక్తికి నిదర్శనమన్నారు. భారీ జనసమీకరణతో సభలు పెట్టడం కష్టమేమీ కాదని, కానీ, బూత్‌స్థాయిలో క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలందరినీ ఒకేచోట ఇంత పెద్దఎత్తున సమీకరించడం పెద్దసవాల్ అన్నారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లేందుకు, భవిష్యత్తుకు పునాదిరాయి ఈ వేదిక నుంచే చేశారనిపిస్తోందన్నారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

గతంలో ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలంటే అవినీతికి కేంద్రంగా ఉండేవని, దళారుల వ్యవస్థ నడిచేదని, స్టార్‌ హోటళ్లలో తిరిగే వ్యవస్థ ఉండేదని, కానీ ఇప్పుడా దళారులు లేరని, స్వయంగా అధికారులను ప్రజలు కలిసే పరిస్థితి తీసుకు వచ్చామని, రెండేళ్లకు పైగా సమయం గడిచిందని, ఇప్పటి వరకు సర్కారుపై ఎవ్వరూ మరక అంటించలేదన్నారు.

బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని, లోకసభ ముందుకు వస్తోందని, దీనిద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతుందన్నారు.

 బీజేపీ మహా సమ్మేళనం

బీజేపీ మహా సమ్మేళనం

కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాలు పెరుగుతాయని, ఆర్ధికరంగంలో ఏకరూపత వస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+