Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో ఈ రైల్వే స్టేషన్లకు మహర్ధశ, 300 కోట్లతో హైదరాబాద్-యాద్రాద్రికి ఎంఎంటీఎస్‌

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ రైల్వే ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయన్నారు. 2014 నుంచి 2023 వరకు రైల్వే శాఖ బడ్జెట్ 17 రెట్లు పెరిగిందని ఆయన వివరించారు.

హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్‌​(MMTS)ను రూ.300 కోట్లతో నిర్మించబోతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. రీజినల్‌ రింగ్ ​రోడ్డు నిర్మాణానికి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆయన విమర్శించారు. ఆర్​ఆర్ఆర్​ నిర్మాణం కోసం కేంద్రానికి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.

PM Modi to laid foundation for redevelopment of 21 railway stations in Telangana

కాగా, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ వర్చువల్​ పద్ధతిలో ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసైతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ కింద తెలంగాణ రాష్ట్రంలో రూ.898 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్, హైటెక్‌సిటీ, హఫీజ్‌​పేట, ఉప్పుగూడ, మలక్‌పేట, మల్కాజిగిరి, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్డు, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, తాండూరు, రామగుండం, రాయగిరి(యాదాద్రి) రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందనున్నాయి.

మరోవైపు, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ శంకుస్థాపనకు.. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రధాని పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్డీవో మినహా... ఇతర అధికారులు హాజరుకాకపోవడం దారుణమని బండి సంజయ్‌ అన్నారు. అధికార యంత్రాంగంపై ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని ఆరోపించారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రామగుండం, కరీంనగర్‌ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. రెండో దశలో పెద్దపల్లి రైల్వే జంక్షన్‌ అభివృద్ధి కోసం రూ.20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కాగా, ప్రజలకు, ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించడమే... అమృత్ భారత్ స్టేషన్ పథకం లక్ష్యమని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఈ పథకంలో ప్రణాళిక ప్రకారం సౌకర్యాల కల్పనతో పాటు అనవసర నిర్మాణాలు తొలగించనున్నారు. మెరుగైన పార్కింగ్ స్థలం, దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. సకల వసతులతో ఆయా రైల్వే స్టేషన్​లను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+