తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందేభారత్, 24న ప్రారంభం - రూట్లు, షెడ్యూల్ ఇలా..!!
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందేభారత్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు కొనసాగుతున్న రెండు వందేభారత్ కు ఆక్యుపెన్సీ బాగుంది. ఇప్పుడు కొత్తగా కాచిగూడ -యశ్వంత్ పూర్, అదే విధంగా విజయవాడ - చెన్నై మధ్య రెండు నూతన వందేభారత్ రైళ్లను ఈ నెల 24న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ రెండు రైళ్ల షెడ్యూల్, స్టాపులను అధికారులు ఖరారు చేసారు. దీని ద్వారా బెంగళూరు, చెన్నైకి తెలుగు రాష్ట్రాల నుంచి వందేభారత్ అందుబాటులోకి రానుంది.
కాచిగూడ - యశ్వంత్ పూర్ :ఈ నెల 24న ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు అందుబాటులోకి రానున్నాయి. కాచిగూడ- యశ్వంత్ పూర్ రైలు 24వ తేదీ మధ్నాహ్నం 12.30 గంటలకు ప్రధాని వర్చ్యువల్ విధానంలో ప్రారంభిస్తారు. కాచిగూడ స్టేషన్ లో మంతులు..అధికారులు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొంటారు. సోమవారం నుంచి ఈ రైలు రెగ్యులర్ ప్రయాణం ప్రారంభం కానుంది. కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు ఈ రైలు ప్రతీ రోజు బయల్దేరుతుంది. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్నాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది.

విజయవాడ - చెన్నై:తిరిగి మధ్నాహ్నం 2.45 గంటలకు యశ్వంత్ పూర్ లో బయల్దేరి, రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఇదే సమయంలో విజయవాడ -చెన్నై వందేభారత్ కూడా ప్రారంభం కానుంది. ఈ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్ కు చేరుతుంది. ఈ రైలు గురువారం మినహా వారంలో అన్ని రోజులు నడవనుంది.
విజయవాడలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి మధ్నాహ్నం 12.10కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్నాహ్నం 3.20 గంటలకు బయల్దేరి రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుంది. దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణాదిన రెండు రాష్ట్రాలకు వందేభారత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత:చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో తయారైన తొలి కాషాయరంగు వందేభారత్ తొలి రైలును కేరళ రాష్ట్రానికి కేటాయించారు. ఇక, ఇప్పుడు కాచిగూడ -చెన్న మధ్య వందేభారత్ అందుబాటులోకి రావటంతో రెండు ఐటీ సిటీల మధ్య ప్రయాణం 8.30 గంటలు కొనసాగనుంది. అదే విధంగా విజయవాడ - చెన్నై మధ్య ప్రయాణ సమయం వందేభారత్ ద్వారా 6 గంటల 40 నిమాషాలుగా నిర్ణయించారు.
ఈ రెండు రైళ్లకు సంబంధించి రిజర్వేషన్ కోసం రైళ్ల నెంబర్లు, టికెట్ల ధరలను ఈ రోజు ప్రకటించనున్నారు. త్వరలోనే విశాఖ - భువనేశ్వర్ మధ్య వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications