ప్రధాని మోడీ వరంగల్ పర్యటన: మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే!!
భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ వరంగల్ వేదికగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్ ను వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 7 గంటల 35 నిమిషాలకు వారణాసి ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి 9 గంటల 25 నిమిషాలకు హకీంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 9 గంటల 30 నిమిషాలకు హకీంపేట ఎయిర్ పోర్ట్ నుండి MI 17 హెలికాప్టర్లో బయలుదేరి మామునూరు ఎయిర్ స్ట్రిప్ కు 10 గంటల 15 నిమిషాలకు చేరుకుంటారు.

10 గంటల 15 నిమిషాలకు అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 10 గంటల 30 నిమిషాలకు భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ఆలయంలో 10 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటుగా ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆపై 10 గంటల 50 నిమిషాలకు భద్రకాళి ఆలయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ కు చేరుకుంటారు. 11గంటల నుండి 11గంటల 35 నిమిషాల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. 11గంటలకు వేదికపైకి చేరుకున్న ప్రధానికి ఆహ్వానం పలుకుతారు. 11:01 నుండి 11 :06 నిమిషాల వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం ఇస్తారు.
తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 11 :06 నిమిషాల నుండి 11: 11 నిమిషాల వరకు మాట్లాడతారు. అనంతరం 11:11 నుండి 11:16 వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారు. 11 గంటల 16 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారు.
కరీంనగర్ వరంగల్ ఎన్ హెచ్ 563 నాలుగు లేన్ల అభివృద్ధి పనులను, ఎన్ హెచ్ 163 జి మంచిర్యాల నుండి వరంగల్ జాతీయ రహదారి నాలుగులేన్ల ఏసీ న్యూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు నార్వా నుండి పుట్టపాక, పుట్టపాక నుండి పంగిడిపల్లికి, పంగిడిపల్లి నుండి ఊరుగొండ కు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆపై రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేట కు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం నిర్వహించే అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ అయిన బహిరంగసభలో నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకూ పార్టీకి సంబంధించి బహిరంగ సభతో పాటుగా పార్టీ నేతలతో మాట్లాడనున్నారు. 12 గంటల 30 నిమిషాలకు తిరిగి రోడ్డు మార్గాన ఎయిర్ స్ట్రిప్ కు బయల్దేరి 12 గంటల 50 నిమిషాలకు అక్కడికి చేరుకుంటారు.

12 గంటల 55 నిమిషాలకు మామునూరు ఎయిర్ స్ట్రిప్ నుండి హకీమ్ పేటకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటల 40 నిమిషాలకు హకీమ్ పేట ఎయిర్ పోర్ట్ కు, అనంతరం అక్కడి నుండి 1:45 బయలుదేరి 3:55 నిమిషాలకు బికనీర్ ఎయిర్ పోర్ట్ రాజస్థాన్ కు చేరుకోనున్నారు.












Click it and Unblock the Notifications