కేసీఆర్ పరిస్ధితికి బాధపడ్డా- త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఇంట్లో కాలు జారి పడిపోయారు. దీంతో స్వల్ప గాయమైన ఆయన్ను యశోదా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రాధమిక పరిశీలన అనంతరం డాక్టర్లు రెండు రోజుల్లో కేసీఆర్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సహా పలువురు కేసీఆర్ ఆరోగ్యంపై స్పందిస్తున్నారు.

కేసీఆర్ కాలు జారి పడటంతో తుంటి ఫ్రాక్చర్‌ అయినట్లు వైద్యులు భావిస్తున్నారు. దీనికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉండొచ్చని తెలుస్తోంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గత మూడు రోజులుగా కేసీఆర్ తన ఇంటి వద్ద ప్రజలను కలుస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

pm modi wished speedy recovery of former telangana cm kcr, says distressed..

"తెలంగాణ మాజీ సీఎం శ్రీ కేసీఆర్‌గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోడీ ఎక్స్ లో తెలిపారు. మోడీతో పాటు పలువురు ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలు కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ స్పందిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న యశోద ఆస్పత్రి వద్ద భద్రత పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+