క్షేమంగా ఉన్నారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి: తెలుగువారితో మోడీ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: లిబియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ భర్తలను విడిపించి, తీసుకురావాలని బలరాం భార్య లక్ష్మి, గోపీకృష్ణ సతీమణి కళ్యాణి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం వారు ప్రధానిని పార్లమెంట్ ఆవరణలో కలుసుకున్నారు. ఉగ్రవాదుల చెరలోబందీలుగా ఉన్నతెలుగువారు క్షేమంగానే ఉన్నారని, వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధాని వారికి తెలిపినట్లు తెలిసింది.
అంతకుముందు వారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడులతో కూడా భేటీ అయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ వీరిని ఢిల్లీకి తీసుకెళ్లి మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ద్వారా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు. తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణ అపహరణకు గురై 13 రోజులు గడిచాయి.
వారు విడుదల కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని వారి భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సుష్మాస్వరాజ్‌తో వెంకయ్యఫోన్‌లో మాట్లాడారు. బందీలను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అనంతరం వారు సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అక్కడి ప్రతినిధుల ద్వారా మిలిటెంట్లతో జరుగుతున్న చర్చల వివరాలను సుష్మ వారికి వివరించారు.
లిబియాలో ప్రస్తుతం ప్రభుత్వమే లేదని, మన దేశ దౌత్య కార్యాలయం కూడా లేదని, తొలి రోజున నలుగురిని అపహరించినప్పుడు సిర్ట్ యూనివర్సిటీ డీన్ ద్వారా చర్చల ప్రక్రియను ప్రారంభించి ఇద్దరిని సురక్షితంగా తీసుకురాగలిగామని, మిగిలిన ఇద్దరి కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ కారణాల వల్లనే జాప్యం జరుగుతున్నదని తెలిపారు.
ప్రస్తుతం సిబ్బంది లేకపోయినా ఇద్దరు ప్రతినిధులను గంటల వ్యవధిలోనే సమకూర్చామని, డీన్ ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం కూడా మాట్లాడామని, ఆ ఇద్దరు ప్రొఫెసర్లు క్షేమంగానే ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ప్రస్తుతం లిబియాలో ఐఎస్‌ఐఎస్ వ్యవహారం ఎవరి నియంత్రణలోనూ లేదని మంత్రి తెలిపారు.
కాగా, అనంతరం లక్ష్మి, కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తమకు ఎలాంటి సందేహం లేదని అన్నారు. సుష్మాస్వరాజ్ మాటలు విన్న తర్వాత తమ మనసు చాలా తేలికైందని, ఇకపై వారు ఎప్పుడు తిరిగి వస్తారన్న సందర్భం కోసమే ఎదురుచూస్తున్నామని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీతో..
లిబియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ భర్తలను విడిపించి, తీసుకురావాలని బలరాం భార్య లక్ష్మి, గోపీకృష్ణ సతీమణి కళ్యాణి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీతో..
సోమవారం వారు ప్రధానిని పార్లమెంట్ ఆవరణలో కలుసుకున్నారు. తెలుగువారు క్షేమంగానే ఉన్నారని, వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధాని వారికి తెలిపినట్లు తెలిసింది.

కేంద్రమంత్రి వెంకయ్యతో
అంతకుముందు వారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడులతో కూడా భేటీ అయ్యారు.

కేంద్రమంత్రితో సుష్మాతో..
ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ వీరిని ఢిల్లీకి తీసుకెళ్లి మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ద్వారా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు. తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణ అపహరణకు గురై 13 రోజులు గడిచాయి.

కేంద్రమంత్రితో సుష్మాతో..
వారు విడుదల కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని వారి భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సుష్మాస్వరాజ్‌తో వెంకయ్యఫోన్‌లో మాట్లాడారు. బందీలను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వారికి వివరించారు.












Click it and Unblock the Notifications